కేర‌ళ స్ట‌యిల్ ముట్ట రోస్ట్‌.. అదేనండీ ఎగ్ రోస్ట్ చేస్తే సూప‌ర్ అనాల్సిందే!

కావాల్సిన ప‌దార్థాలు :
కోడిగుడ్లు : 4
ఉల్లిగ‌డ్డ‌లు : 150 గ్రా.
ట‌మాటాలు : 200 గ్రా.
ప‌చ్చిమిర్చి : 2
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్‌స్పూన్స్
కారం : 2 టీస్పూన్స్
గ‌రం మ‌సాలా : ఒక టీస్పూన్
ధ‌నియాల పొడి : ఒక టీస్పూన్
మిరియాల పొడి : ఒక‌టిన్న‌ర టీస్పూన్
జీల‌క‌ర్ర పొడి : ఒక టీస్పూన్
క‌రివేపాకు : రెండు రెమ్మ‌లు
కొబ్బ‌రినూనె, ఉప్పు : త‌గినంత

త‌యారీ విధానం :
స్టెప్ 1 :
కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి గాట్లు పెట్టి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఉల్లిపాయ‌ల‌ను నిలువుగా, స‌న్న‌గా క‌ట్ చేయాలి. అలాగే ట‌మాటాల‌ను, ప‌చ్చిమిర్చి క‌ట్ చేసి పెట్టాలి.
స్టెప్ 2 : క‌డాయిలో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె పోసి గాట్లు పెట్టిన గుడ్ల‌ను లేత బంగారు రంగు వ‌చ్చేవ‌ర‌కు వేయించాలి.
స్టెప్ 3 : ఆ గుడ్ల‌ను ప‌క్క‌న పెట్టి అదే నూనెలో ఉల్లిపాయ‌లు, ప‌చ్చిమిర్చి వేసి బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చేవ‌ర‌కు వేగ‌నివ్వాలి. ఇందులో ట‌మాటా ముక్క‌లు వేసి మూత పెట్టేయాలి.
స్టెప్ 4 : ట‌మాటాలు ఉడికిన త‌ర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మ‌రో మూడు నిమిషాలు క‌లుపాలి. ఆ త‌ర్వాత ఇందులో కారం, జీల‌క‌ర్ర పొడి, మిరియాల పొడి, గ‌రం మాసాలా, ధ‌నియాల పొడి, క‌రివేపాకు, ఉప్పు వేయాలి.
స్టెప్ 5 : ఐదు నిమిషాల పాటు ఈ మాసాలు వేగ‌నివ్వాలి. ఇప్పుడు అందులో పావు క‌ప్పు నీళ్లు పోసి వేయించిన కోడిగుడ్ల‌ను వేయాలి. ఐదు నిమిషాలు మ‌సాలాలు ప‌ట్టేలా వీటిని క‌లుపుతుండాలి.
స్టెప్ 6 : అంతే వేడి వేడి కూర రెడీ అయిపోతుంది. దీన్ని కేర‌ళ ప‌రోటా, అప్పంల‌తో క‌లిపి తినేయొచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress