కావాల్సిన పదార్థాలు :
వంకాయలు : పావు కిలో
ఆమ్చూర్ పొడి : ఒక టీస్పూన్
పసుపు : అర టీస్పూన్
సోంపు : అర టీస్పూన్
జీలకర్ర : అర టీస్పూన్
టమాట : ఒకటి ( పెద్దది)
అల్లంవెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
పచ్చిమిర్చి : 2
కారం : అరటీస్పూన్
గరం మసాలా : అరటీస్పూన్
నూనె : 100గ్రా.
కొత్తిమీర : చిన్న కట్ట
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
స్టెప్ 1 : ముందుగా లేత వంకాయలను తీసుకొని రెండు గాట్లు పెట్టి నాలుగు ముక్కలుగా చేసి ఉప్పు వేసి ఉంచాలి.
స్టెప్ 2 : ఇప్పుడు మందపాటి గిన్నె పెట్టి నూనె పోయాలి. అందులో జీలకర్ర వేసి వేయించాలి.
స్టెప్ 3 : దీంట్లో పసుపు, జీలకర్రపొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, సోంపు, ఆమ్చూర్ పొడి వేసి వేగనివ్వాలి.
స్టెప్ 4 : ఇందులోనే పచ్చిమిర్చి, టమాట రసం వేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి.
స్టెప్ 5 : బాగా ఉడికిన తర్వాత వంకాయలు వేసి వేగనివ్వాలి. దగ్గరకు అయ్యాక ఉప్పు, కొత్తిమీర వేసి మరో నిమిషం ఉంచి దించేయాలి.
