ఎప్పుడూ మ‌న రుచులేనా.. స‌రికొత్త‌గా ఒడిశా హ‌బిసా దాల్మా ట్రై చేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :
పెస‌ర‌ప‌ప్పు : ఒక క‌ప్పు
అర‌టికాయ‌లు : 2
చామ‌గ‌డ్డ‌లు : 6
ఎలిఫెంట్ ఆపిల్ రేకు : 1
బెల్లం : చిన్నముక్క
నెయ్యి : 3 టేబుల్‌స్పూన్స్‌
జీల‌క‌ర్ర : ఒక టీస్పూన్
ఎండుమిర్చి : 2
నీళ్లు : 3 క‌ప్పులు
ఉప్పు : త‌గినంత‌

త‌యారీ విధానం :
స్టెప్ 1:
పెస‌ర‌ప‌ప్పు ఒక‌సారి క‌డిగి కాసేపు నాన‌బెట్టాలి. అర‌టికాయ తొక్క తీసి వాటిని స‌న్న‌గా, గుండ్రంగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 2 : చామ‌గ‌డ్డ‌ల‌ను పొట్టు తీసి పెట్టాలి. అలా ఎలిఫెంట్ ఆపిల్ రేకును క‌ట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 3 : క‌డాయిలో నూనె వేసి నీళ్లు పోయాలి. నీళ్లు కాస్త మ‌రిగాక‌.. కొద్దిగా ఉప్పు వేయాలి. ఇందులోనే అర‌టికాయ ముక్క‌లు, చామ‌గ‌డ్డ‌ల‌ను వేసి స‌గం ఉడికేలా చూసుకోవాలి.
స్టెప్ 4 : ఇప్పుడు దీంట్లో పెస‌ర‌ప‌ప్పు, బెల్లం వేసి క‌లుపాలి. పావుగంట పాటు స‌న్న‌ని మంట మీద కూర‌గాయ‌లు ప‌ప్పు ఉడికే వ‌ర‌కు ఉంచుకోవాలి.
స్టెప్ 5 : ఎలిఫెంట్ ఆపిల్ రేకును వేసి మ‌రో రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఇప్పుడు చిన్న కడాయిలో నెయ్యి వేసి జీల‌క‌ర్ర‌, ఎండుమిర్చితో పోపు పెట్టి ఆ ప‌ప్పు మిశ్ర‌మంలో వేసి క‌లుపాలి. ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress