పార్టీలో స్టార్ట‌ర్‌గా ర‌వ్వ పొటాటో చీజ్‌ బాల్స్ ప‌ర్‌ఫెక్ట్ చాయిస్‌!

కావాల్సిన ప‌దార్థాలు :
ర‌వ్వ‌: అర క‌ప్పు
ఆలుగ‌డ్డ‌: ఒక‌టి
చీజ్: ఒక క్యూబ్
కొత్తిమీర‌: స‌గం క‌ట్ట‌
చిల్లీఫ్లేక్స్ : అర టీ స్పూన్
కారం: అర టీ స్పూన్
జీల‌క‌ర్ర‌: అర టీ స్పూన్
ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం:
ప్టెప్1:
ఆలుగ‌డ్డ‌ను ఉడికించాలి. ముందుగా స్టౌ పై ఒక క‌డాయి పెట్టుకొని ఒక టీప్పూన్ నూనె వేసి జీల‌క‌ర్ర‌,చిల్లీఫ్లెక్స్ వేసి స‌గం గ్గాసు నీళ్లు పొసి త‌గినంత ఉప్పు వేసి నీళ్లు మ‌రిగించాలి.
స్టెప్ 2 : నీళ్లు మ‌రిగిన‌ త‌రువాత ర‌వ్వ వేసి ఉడికించుకొని ప‌క్క‌న పెట్టుకోవాలి. కొత్తిమీర స‌న్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్3: ఉడికించుకున్న ఆలుగ‌డ్డను మెత్త‌గా చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ర‌వ్వ మిశ్ర‌మం, కొత్తిమీర‌, చీజ్, కారం, ఉప్పు వేసి బాగా క‌లుపాలి.
స్టెప్ 4: క‌లిపి పెట్టుకున్న మిశ్ర‌మంను చిన్న చిన్న ఉండ‌లుగా చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. క‌డాయిలో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి.
స్టెప్ 5: నూనె వేడి అయిన త‌ర్వాత ముందుగా చేసి పెట్టుకున్న ర‌వ్వ‌ పొటాటో చీజ్ బాల్స్ వేసి స‌న్న‌ని మంట పై గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకుంటే స‌రిపోతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress