ఇడ్లీ.. దోశ‌ల్లోకే కాదు.. అన్నంలోకి కూడా అదిరిపోయే క్యాప్సికం చ‌ట్నీ!

కావాల్సిన ప‌దార్థాలు :
క్యాప్సికం ముక్క‌లు : అర క‌ప్పు
ఉల్లిపాయ ముక్క‌లు : అర క‌ప్పు
వెల్లుల్లిపాయ‌లు : రెండు
నిమ్మ‌రసం : ఒక టీస్పూన్
ఎండుమిర్చి : 3
శ‌న‌గ‌ప‌ప్పు : 3/4 టేబుల్‌స్పూన్
మిన‌ప‌ప్పు : 3/4 టేబుల్‌స్పూన్‌
జీల‌క‌ర్ర : అర టీస్పూన్
ఆవాలు : పావు టీస్పూన్
క‌రివేపాకు : ఒక రెమ్మ‌
ఇంగువ : చిటికెడు
నూనె, ఉప్పు : త‌గినంత

త‌యారీ విధానం :
స్టెప్ 1 :
క‌డాయిలో జీల‌క‌ర్ర‌, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, ఒక ఎండుమిర్చి వేయించి కాస్త చ‌ల్లార‌నివ్వాలి. వీటిని గ్రైండ్ చేయాలి.
స్టెప్ 2 : అదే క‌డాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయ ముక్క‌లు, క్యాప్సికం ముక్క‌ల‌ను వేసి మెత్త‌గా అయ్యేవ‌ర‌కు వేయించాలి. దీన్ని కూడా కాస్త చ‌ల్లార‌నివ్వాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ముందు చేసుకున్న శ‌న‌గ‌ప‌ప్పు పొడిలోనే.. క్యాప్సికం మిశ్ర‌మాన్ని వేయాలి. ఇందులో వెల్లుల్లిపాయ‌, నిమ్మ‌ర‌సం, ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టాలి.
స్టెప్ 4 : ఈ ప‌చ్చ‌డిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చిన్న క‌డాయిలో నూనె పోసి ఆవాలు, జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. అంతే టేస్టీ ప‌చ్చ‌డి మీ ముందుంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress