మ‌హారాష్ట్ర‌లో ఉపావాస స‌మ‌యంలో తినే ద‌హీ సాబుదానా!

కావాల్సిన ప‌దార్థాలు :
సాబుదానా : ఒక క‌ప్పు
పెరుగు : ఒక క‌ప్పు
చ‌క్కెర : పావు టీస్పూన్
జీల‌క‌ర్ర : అర టీస్పూన్
ప‌చ్చిమిర్చి : 1
ప‌ల్లీలు : 2 టేబుల్‌స్పూన్స్
నెయ్యి : ఒక టీస్పూన్
ఉప్పు : త‌గినంత

త‌యారీ విధానం :
స్టెప్ 1:
ప‌ల్లీల‌ను వేయించి పొడి చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. సాబుదానాని కొద్దిగా వేయించుకొని చ‌ల్లార‌నివ్వాలి.
స్టెప్ 2 : ఒక గిన్నెలో పెరుగు వేసుకొని కొన్ని నీళ్లు పోసి క్రీమ్‌లా అయ్యేలా బాగా క‌లుపాలి. ఇందులోనే ఉప్పు, చ‌క్కెర వేయాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఇందులో చ‌ల్లారిన సాబుదానా వేసి క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని 2 నుంచి 3 గంట‌ల‌పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.
స్టెప్ 4 : ఒక‌సారి సాబుదానాని కాస్త ఒత్తి చూడండి. బాగా నానిన త‌ర్వాతనే పోపు పెట్టాలి. ఇప్పుడు చిన్న క‌డాయిలో నెయ్యి వేసి జీల‌క‌ర్ర‌, ప‌చ్చిమిర్చ వేసి వేగాక సాబుదానా మిశ్ర‌మంలో వేయాలి.
స్టెప్ 5: చివ‌ర‌గా ప‌ల్లీల పొడి వేసి క‌లిపితే ఆ టేస్టే అదిరిపోతుంది. శ్రావ‌ణమాసంలో ఉపావాస స‌మ‌యంలో ఇది మంచి ఆహారం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress