కావాల్సిన పదార్థాలు :
బియ్యం : ఒక కప్పు
చక్కెర : కప్పున్నర
యాలకులు: రెండు
మరమరాలు: పావు కప్పు
బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్
వంట సోడా: ఒక టీ స్పూన్
ఉప్పు: చిటికెడు
నెయ్యి: రెండు టీ స్పూన్స్
తయారీ విధానం :
స్టెప్1 : బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.
స్టెప్2: ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం, మరమరాలు, యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొవాలి.
స్టెప్3: స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అందులో చక్కెర వేసి కొన్ని నీళ్లు పోసి చక్కెరను కరిగించుకోవాలి.
స్టెప్4: ఒక గిన్నె తీసుకొని అందులోకి మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా వేసి కలిపి ముందుగా కరిగించి పెట్టుకున్న చక్కెర సిరప్ కూడి వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్5: స్టౌపై ఒక వెడాల్పాటి గిన్నెపెట్టుకొని నెయ్యి వేసి ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమంను వేసి స్టౌ హై ఫ్లెమ్ లో రెండు నిమిషాలు ఉంచి ఆ తర్వాత స్టౌపై దోశ పెనం పెట్టి దానిపై కేక్ మిశ్రమం గిన్నె పెట్టుకొని అరగంట పాటు ఉంచుకోవాలి. కాస్త చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది.
