కావాల్సిన పదార్థాలు :
అన్నం : ఒక కప్పు
గోధుమపిండి : ఒక కప్పు
ఉప్పు : ఒక టీస్పూన్
నూనె : సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్ 1: ముందుగా మిక్సీలో మిగిలిన అన్నం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నీళ్లు ఎక్కువ పోయకూడదు అది గుర్తుంచుకోండి.
స్టెప్ 2: ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని, ఇందులో గోధుమపిండి, ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేసి కావాల్సినన్ని నీళ్లు పోసి మాత్రమే పిండి కలుపుకోవాలి.
స్టెప్ 3 : ఇలా కలుపుకొన్న మిశ్రమాన్ని పావుగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి. పిండి మొత్తం చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 4: ఈలోపు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పూరీలను ఒక్కొక్కటిగా వేసి రెండు వైపులా పొంగేలా కాల్చుకోవాలి. వీటిని మామూలు పూరీల్లా ఏ కూరతోనైనా తినేయొచ్చు. అన్నం మిగిలిందని పడేయకుండా ఇలా చేసి టేస్టీ పూరీలను చేసుకోండి.
