కావాల్సిన పదార్థాలు :
ఆలుగడ్డలు : అర కిలో
కార్న్ ఫ్లోర్ : నాలుగు టీస్పూన్లు
కారం: ఒక టీ స్పూన్
ఉప్పు, నూనె: సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్1: ఆలుగడ్డ చెక్కు తీసి సన్నగా, పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆలుగడ్డలు రంగు మారకుండా కొన్ని నీళ్లు, ఉప్పు వేసి ఉంచాలి.
స్టెప్2: మరో గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకొని అందులో కట్ చేసి పెట్టకున్న ఆలుగడ్డ వేసి రెండు నిమిషాల పాటు ఉడింకించుకోవాలి. తరువాత ఆలుగడ్డలోని నీళ్లు తీసేసి చల్లాని నీళ్లు పోసుకొని ఆలుగడ్డలని చల్లార్చుకోవాలి.
స్టెప్3: చల్లారిన ఆలుగడ్డలలో కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.
స్టెప్4: స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడ నూనె పోసుకొని వేడి అయిన తర్వాత ముందుగా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఆలుగడ్డ లు వేసి సన్నని మంట పై గోల్ట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని టమాటా కెచప్‌తో తింటే యమ టేస్టీగా ఉంటాయి.
