కావాల్సిన పదార్థాలు :
బియ్యం: ఒక గ్లాసు
ఆలుగడ్డలు : రెండు
ఉల్లిపాయ: ఒకటి
లవంగాలు: నాలుగు
యాలకులు: రెండు
దాల్చిన చెక్క: ఒక ఇంచు ముక్క
మిరియాలు: ఒక టీస్పూన్
జీలకర్ర: ఒక టీస్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
జీడిపప్పు: రెండు స్పూన్లు
పచ్చిమిర్చి: నాలుగు
అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్
కొత్తిమీర:ఒక కట్ట
నూనె, ఉప్పు:సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి.
స్టెప్2: ఆలుగడ్డ, ఉల్లిపాయ,పచ్చిమిర్చి కట్ చేయాలి. కొత్తిమీర సన్నగా కట్ చేయాలి.
స్టెప్3: స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్4: అదే కడాయిలో ఇంకో రెండు స్పూన్ల నూనె వేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ రంగు మారిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
స్టెప్5: ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నం, వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
అంతే ఎంతో రుచికరమైన ఆలూ రైస్ రెడీ!