మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి!

2025 జూన్ 5.. లాస్ ఏంజిల్స్… AT&T and Tribeca Festival జ‌రిగింది. 320 టీమ్స్ ఇందుకు పోటీ ప‌డ్డాయి. అందులో ఫైన‌ల్‌లో 5 సినిమాలు మిగిలాయి. కానీ మిలియన్ డాలర్ల అవార్డు 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్ ద‌క్కింది మాత్రం Take Me Home సినిమాకి.

Joyland చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచిన తెలుగింటి అమ్మాయి అపూర్వ చ‌ర‌ణ్‌. ఈసారి AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రాంట్ గెలుచుకొని మరో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. వందలాది చిత్రాలను పక్కకు నెట్టి ఆమె ప్రొడ్యూస్ చేస్తున్న “Take Me Home” అనే చిత్రం ఎంపికైంది. ఈ గ్రాంట్ గెలవడమంటే కేవలం డబ్బు గెలవడం కాదు అంతర్జాతీయ గుర్తింపు పొందడం. ఈ చిత్రానికి లిజ్ సార్జెంట్ దర్శకత్వం వహిస్తున్నారు.

క‌థేమిటంటే..
ఈ కథ అన్నా అనే 38 ఏళ్ల కొరియన్ దత్తత కుమార్తె చుట్టూ తిరుగుతుంది. మెదడులో కణితి కారణంగా మామాలుగా ఎదగాల్సిన ఆమె మెదడు ఎదగదు. దాన్ని ఇంగ్లీషులో Childhood Disintegrative Disorder (CDD) అంటారు. దీనివల్ల జ్ఞాపకశక్తి తక్కువ ఉంటుంది. శరీర ఎదుగుదల మాత్రం సజావుగానే ఉంటుంది. దీనివల్ల వచ్చే సమస్యలు, కుటుంబం, వైకల్యం, దత్తత, సంరక్షణ వంటి వాటిని ఈ చిత్రం డీల్ చేస్తుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్ల‌ మధ్య సాగే భావోద్వేగ యాత్ర ఈ కథ. అన్‌టోల్డ్ స్టోరీస్ విజేతకు AT&T, ట్రైబెకా సంస్థల నుంచి ఏడాది పొడవునా మద్దతు ఉంటుంది. ట్రైబెకా ఫెస్టివల్‌లో ప్రీమియర్‌కు ముందు మాత్రమే కాకుండా, ప్రపంచ ప్రదర్శన అనంతరం కూడా విజేతకు పలు అంశాల్లో సూచనలు సలహాలు ఇస్తుంది.

క‌ళ‌ల‌పై మ‌క్కువ‌..
అపూర్వ చరణ్ LA కి చెందిన నిర్మాత. ఆమె అనంత‌పురం జిల్లాలో జ‌న్మించింది. తండ్రి హ‌రిచ‌ర‌ణ్‌, త‌ల్లి సుక‌న్య‌. కొంత‌కాలం వాళ్లు హైద‌రాబాద్‌లో కూడా నివాస‌మున్నారు. ఆ త‌ర్వాత అమెరికా చేరిందా కుటుంబం. ఇక్క‌డ‌ ఉత్తర కాలిఫోర్నియాలో పెరిగింది. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్, న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీ నుంచి క్రియేటివ్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ లో MFA (మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) డిగ్రీ పొందింది. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (AFI) కన్సర్వేటరీలో ఫెలోగా ఉన్నది.

తల్లిదండ్రులిద్దరికీ కళలన్నా, సినిమాలన్నా మక్కువ ఎక్కువే. సాహిత్యమంటే చెవి కోసుకునేంత ప్రేమ. ఒకట్రెండు తెలుగు సినిమాలూ తీసి చేతులు కాల్చుకున్న సందర్భాలు లేకపోలేదు. తండ్రి బాటలోనే నడిచిన అపూర్వ సినీరంగాన్నే ఎంచుకున్నది. చలనచిత్ర నిర్మాతగా, దర్శకురాలిగా, నటిగా కూడా ఎదిగింది. ఆమె నిర్మాణ తొలి చిత్రం JOYLAND కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (2022)లో ప్రదర్శించబడింది. అన్ సెర్టైన్ రిగార్డ్ జ్యూరీ ప్రైజ్, క్వీర్ పామ్, ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ (2023)లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం 95వ అకాడమీ అవార్డులకు పాకిస్తాన్ నుంచి ఎంట్రీగా నిలిచింది. షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్న పాకిస్తాన్ నుంచి మొదటి చిత్రం సన్‌డాన్స్, TIFF మరియు BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్సవాల్లో ప్రదర్శించబడింది.

ఎన్నో అవార్డులు..
కొలంబియా విశ్వవిద్యాలయం యొక్క MFA ఫిల్మ్ ప్రోగ్రామ్ పూర్వ విద్యార్థి అయిన చరణ్ AFI ఫెస్ట్ 2020లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఆడియన్స్ అవార్డును గెలుచుకున్న LONELY BLUE NIGHTతో సహా అనేక అవార్డు గెలుచుకున్న లఘు చిత్రాలను నిర్మించింది. 2018లో ఫిల్మ్ పైప్‌లైన్ ఉత్తమ ఫిల్మ్20 TIFF అవార్డును గెలుచుకున్న Max, DISTANCEలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. అపూర్వ చరణ్ 2019 ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ఫెలో, 2020 ఫిల్మ్ ఇండిపెండెంట్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ల్యాబ్ ఫెలో, 2021 ఉమెన్ ఇన్ ఫిల్మ్ ఎమర్జింగ్ ప్రొడ్యూసర్స్ ఫెలో, 2022 సన్‌డాన్స్ క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ ల్యాబ్ ఫెలో, 2023 BAFTA బ్రేక్‌త్రూ.

ఆమె బిగ్ బీచ్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ లైవ్ యాక్షన్ విభాగంలో అభివృద్ధిలో పనిచేసింది. తన చలనచిత్ర, టీవీ నిర్మాణ సంస్థ ఆల్ కాప్స్ ద్వారా, చరణ్ ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రత్యేకమైన కథనాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్న‌ది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress