చ‌పాతీ.. పూరీ.. అన్నంలోకి కూడా సూప‌ర్‌గా ఉండే మేతీ చమాన్!

కావాల్సిన పదార్థాలు:
మెంతి కూర : నాలుగు చిన్నకట్టలు
పన్నీరు : 100గ్రా||
ఫ్రెష్ క్రీం: ముప్పావు కప్పు
జీలకర్ర : ఒక టీ స్పూన్
ఉల్లిపాయ : ఒకటి
టమాటాలు : రెండు
జీడిపప్పు : అర కప్పు
పసుపు : పావు టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్ : ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి : రెండు
నెయ్యి : ఒక టీస్పూన్
కారం : ఒక టీస్పూన్
ధ‌నియాల పొడి : ఒక టీస్పూన్
గరం మసాలా : అర టీస్పూన్
నూనె, ఉప్పు: సరిపడినంత

తయారీ విధానం :
స్టెప్1:
ముందుగా ఉల్లిపాయ, టమాటాలు, మెంతి కూర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ కూడా కాస్త చిన్న సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి. జీడి పప్పు వేడి నీళ్లు పొసి ఒక అరగంట పాటు నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి.
స్టెప్2: స్టౌపై ఒక పాన్ పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పచ్చి మిర్చి, టమాట ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
స్టెప్3: టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నీళ్లు పోయడం వల్ల మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. నూనె పైకి తేలే వరకు కలుపుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసి కలుపుకోవాలి. మెంతికూర బాగా వేగి నూనె పైకి వచ్చిన తర్వాత మిక్సీ ప‌ట్టుకున్న‌ జీడిపప్పు పేస్ట్, ఒక కప్పు నీళ్లు పోసుకొని కలుపుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు పన్నీరు ముక్కలు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచాలి. చివ‌ర‌గా ఫ్రెష్ క్రీం వేసుకొని కలిపి వెంటనే స్టౌ ఆఫ్ చేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress