కావాల్సిన పదార్థాలు:
సాబుదానా : ఒక కప్పు
చక్కెర : రెండు కప్పులు
క్యారెట్స్ : రెండు
యాలకుల పొడి : ఒక టీస్పూన్
జీడిపప్పు, పిస్తా : గుప్పెడు
నెయ్యి : రెండు టీస్పూన్స్
నీళ్లు: రెండు గ్లాసులు
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా సాబుదానా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాసు నీళ్లు పొసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్‌ని కట్ చేసి మిక్సీ పట్టి జ్యూస్ తీసి పెట్టుకోవాలి.
స్టెప్2: స్టౌపై ఒక పాన్ పెట్టుకొని చక్కెర వేసుకొని నీళ్లు పోసి లేత పాకం వచ్చాక సాబుదానా మిశ్రమం వేసి వుండలు లేకుండా కలుపుకోవాలి.
స్టెప్3: ఇప్పుడు నెయ్యి, యాలకుల పొడి, క్యారెట్ జ్యూస్ వేసి కలిపి సన్నని మంట పై ఉడికించుకోవాలి. దీంట్లో కట్ చేసుకున్న జీడి పప్పు, పిస్తా వేసి కలుపుకోవాలి.
స్టెప్4: ఒక కేక్ మౌల్ట్ లేదా ప్లేట్‌కి నెయ్యి రాసి అందులోకి ఈ మిశ్రమంను వేసి కాస్ల చల్లారిన తర్వాత మనకి కావాల్సినట్టుగా కట్ చేసి తినేయొచ్చు.