కావాల్సిన పదార్థాలు:
పుల్లటి మామిడి కాయలు : ఐదు
కారం : ఒక కప్పు
ఉప్పు : అర కప్పు
ఆవపొడి : పావు కప్పు
నూనె : ఒక కప్పు
జీలకర్ర మెంతుల పొడి : రెండు టీస్పూన్స్
జీలకర్ర : ఒక టీ స్పూన్
వెల్లులి : పది రెబ్బలు
మెంతులు : అర టీస్పూన్
ఆవాలు : ఒక టీస్పూన్
పల్లీలు : రెండు టీస్పూన్స్
శనగ పప్పు : ఒక టీస్పూన్
మినప పప్పు : ఒక టీస్పూన్
ఎండు మిర్చి : నాలుగు
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారీ విధానం:
స్టెప్ 1 : మామిడి కాయలు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. మామిడి కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 2: ఒక గిన్నెలో కట్ చేసుకున్న మామిడి కాయ ముక్కలు, కారం, ఉప్పు, ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి, వెల్లులి పాయలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 3: స్టౌపై ఒక పాన్ పెట్టుకొని పావు కప్పు నూనె వేసుకొని నూనె వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, పల్లీలు, శనగ పప్పు, మినప పప్పు, కరివేపాకు బాగా వేగిన తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించుకోవాలి.
స్టెప్ 4: ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మామిడి కాయ మిశ్రమంలో ఇందాక వేసుకున్న పోపుని వేసి బాగా కలుపుకోవాలి. అంతే.. అద్భుతమైన పులిహోర ఆవకాయ రెడీ!