ఇంట్లోనే చాలా ఈజీగా ర‌వ్వ‌తో చాక్లెట్ కేక్‌ని త‌యారుచేసుకోండిలా!

కావాల్సిన ప‌దార్థాలు :
ర‌వ్వ : ఒక క‌ప్పు
చ‌క్కెర : అర క‌ప్పు
పాలు : అర క‌ప్పు
నూనె : పావు క‌ప్పు
కండెన్స్‌డ్‌ మిల్క్ : పావు క‌ప్పు
మైదా : పావు క‌ప్పు
కోకో పౌడ‌ర్ : పావు క‌ప్పు
బేకింగ్ పౌడ‌ర్ : ఒక టీస్పూన్
బేకింగ్ సోడా : అర టీస్పూన్
బాదం ప‌లుకులు : 10

త‌యారీ విధానం :
స్టెప్ 1:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ర‌వ్వ‌, చ‌క్కెర‌, పాలు పోసి బాగా క‌లిపి ప‌ది నిమిషాలు ప‌క్క‌న పెట్టుకోవాలి. బాదం ప‌లుకల‌ను చిన్న‌గా క‌ట్ చేసుకోవాలి.
స్టెప్2: ఇప్పుడు క‌లిపి ప‌క్క‌న పెట్టుకున్న మిశ్ర‌మంలో నూనె, కండెన్స్‌డ్‌ మిల్క్ వేసి క‌లుపాలి.
స్టెప్ 3: ఆ త‌ర్వాత మైదా, కోకో పౌడ‌ర్, బేకింగ్ పౌడ‌ర్, బేకింగ్ సోడా జ‌ల్లించి కొద్దిగా జారుగా క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొన్ని పాలు పోసుకోండి.
స్టెప్4: ఓవెన్‌ని 170 డిగ్రీలో ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులో ముందుగా క‌లిపి పెట్టుకున్న మిశ్ర‌మం వేసుకొని ఒక‌సారి ట్యాప్ చేయాలి. పై నుంచి బాదం ప‌లుకుల‌ను వేయాలి.
స్టెప్5: ఇప్పుడు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో కేక్ మిశ్ర‌మం పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress