ఎండలు మండుతున్న కాలంలో ఫ్యాన్స్, ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నాం. కానీ 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌లు నమోదవుతున్న గుజరాత్‌లోని ఈ ఇంట్లో ఏసీ అవసరం లేకుండా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదువండి.
భారతదేశంలో.. ఏప్రిల్ నుండి జూలై వరకు అనేక ప్రాంతాలు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటాయి. ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. గుజరాత్‌లో కూడా ఈ వేడి అంతకుంతకు పెరుగుతూనే ఉంటుంది. గుజరాత్‌లో మండే వేసవిలో సమీరా రాథోడ్ రూపొందించిన ‘కూల్ హౌస్ కట్టించుకున్నారు. వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఎయిర్ కండిషనర్లను వాడకుండా ఒక అద్భుతమైన ఇల్లు ఉంది. చాలా గృహాల మాదిరిగా కాకుండా ఈ ప్రత్యేకమైన నివాసం ఈ పరికరాలు ఏవీ లేకుండానే హాయిగా చల్లగా ఉంటుంది.
ఐదు సంవత్సరాలు..
“క్లయింట్ అక్షరాలా ‘చల్లని’ ఇంటిని కోరుకున్నారు. భారుచ్ వేడిని తట్టుకునే ఇల్లుల కావాలని అన్నారు. అందుకే మేము దానిని అందించాం. ఇంటి వేడిని తగ్గించడానికి మేము గాలుల దిశ, డిజైన్, శీతలీకరణ పదార్థాలను ఉపయోగించాం” అని సమీరా రాథోడ్ డిజైన్ అటెలియర్ ప్రధాన ఆర్కిటెక్ట్, వ్యవస్థాపకురాలు సమీరా రాథోడ్ చెప్పారు. కూల్ హౌస్ పూర్తి కావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది. ముందుంగా స్కెచింగ్, డిజైనింగ్, ప్రయోగాలు చేశారు. క్లయింట్‌కి ఇప్పటికే ఒక ఇల్లు ఉంది. దాని చుట్టూ ఇళ్లు ఉన్నాయి. దాన్ని పడగొట్టి ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నారు. “ఆ ప్లాట్ చుట్టూ మూడు భవనాలు మరియు ఒక వైపు రోడ్డు ఉన్నాయి. ఇల్లు కనిపించే ఏకైక దృశ్యం పొరుగువారి భవనం. ఆ కోణంలో అంతర్ముఖ ఇల్లు మంచి ఎంపిక. మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఇల్లు తెరుచుకునే ప్రదేశం ఇది. బయటి నుండి చూస్తే, ఇది చాలా మూసివేసిన నిర్మాణంలా కనిపిస్తుంది” అని ఆమె వివరిస్తుంది.

గాలి చల్లబడడానికి..
10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఇల్లు, గాలి ఇంటి గుండా వెళ్ళేలా చేసే ప్రత్యేకమైన డిజైన్ నిర్మాణాన్ని కలిగి ఉంది. “ఇల్లు లోపలికి కనిపిస్తుంది. అంతేకాదు.. మేము చెట్లతో ప్రాంగణాలను సృష్టించాం. తద్వారా మీరు లోపలికి కాకుండా బయట చూస్తున్నట్లు అనిపిస్తుంది. మొదటి అంతస్తులోని ప్రాంగణం మధ్యలో తోట లాంటి దృశ్యంతో ఒక అందమైన చెట్టు ఉంది. గాలి వెళ్ళడానికి ఈశాన్య, నైరుతి వైపున ఒక కాలువను సృష్టించాం” అని సమీరా చెబుతున్నది. ఇంటికి ఇరువైపులా గదులతో కూడిన ట్రాక్ లాంటి డిజైన్‌పై నిర్మించబడిన ఈ ప్రాంగణాలు గాలి ప్రసరణకు సహాయపడతాయి. గాలి కాస్త వెచ్చగా ఉన్నప్పటికీ, గాలి మనం దక్షిణం వైపున సృష్టించిన నీటి కొలను వనరు గుండా వెళ్లి చల్లబరుస్తుంది. ఈ గాలి మొత్తం ఇంటిని చల్లబరుస్తుంది. అంతేకాదు.. ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడే మరొక ఏర్పాటు చేశారు ఈ ఇంటిలో. చిన్న నీటి వనరుతో కూడిన టెర్రస్ గార్డెన్. ఇది రెండవ అంతస్తుతో పాటు నడుస్తున్న కాలువను, దాని ఒక చివర జాలీ నిర్మాణంతో కూడిన ప్రాంగణాన్ని చల్లబరుస్తుంది.
వేడిని ఎదుర్కొవడానికి ఇల్లు 18-అంగుళాల మందపాటి బాహ్య గోడలను, సున్నపు ప్లాస్టర్‌తో లోపలి భాగాన్ని వేయింఆచరు. ఇది గదులను చల్లగా, గాలులతో సమర్థవంతంగా ఉంచుతుంది. అదనంగా ఇంటిని మరింత స్థిరంగా ఉంచడానికి వారు లోపలి కోసం తిరిగి పొందిన కలపను ఉపయోగించారు. శక్తి కోసం సౌర ఫలకాలను, సౌర గీజర్‌లను కూడా ఉపయోగించారు.
శాంతి నివాసం..
“నా తల్లిదండ్రులు, నా భార్య, నా ఇద్దరు కుమార్తెలు సహా మా కుటుంబంలోని మూడు తరాలు ఈ ఇంట్లో నివసిస్తున్నారు. మేము ఇంటి ప్రతి అంగుళాన్ని ఆనందిస్తాం. నేను కొత్త ఇల్లు కట్టుకోవాలని అనుకున్నప్పుడు, నా మనసులో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఉదాహరణకు అది సాంప్రదాయ శీతలీకరణ పద్ధతులను ఉపయోగించాలనుకున్నాను. నా ఆలోచనలు సమీరాతో బాగా కలిసిపోయాయి. నా ఇల్లు మంచి చేతుల్లో ఉందని నాకు తెలుసు” అని ఆయన జతచేస్తున్నారు. ఇంకా ఈ భవనం అంతటా గాలి ప్రసరించేలా 63 పెద్ద, చిన్న కిటికీల కలయికతో ఈ ఇంటి నిర్మాణం చేశారు. ముందుగా ఇల్లు దక్షిణం వైపు ఉండడం వల్ల రోజంతా సహజంగానే వేడి బాగా వస్తుంది ఇంట్లోకి. దీన్ని సమీరా ఎలా డిజైన్ చేస్తుందోనని ఆ ఇంటి యజామానికి సందేహం ఉండేది. కానీ అద్భుతమైన డిజైన్‌తో ఇంట్లో ఉష్ణోగ్రత 29 డిగ్రీల వరకు ఉండేలా చేశారు.

కొన్ని గదుల్లో..
ఆర్కిటెక్ట్ సమష్టి కృషి, డిజైన్ ఎంపికల ద్వారా ఉష్ణోగ్రతలో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా చేశారు. బయట 40 డిగ్రీలపైన ఉంటే కనీసం 30 నుంచి 35 డిగ్రీలు ఉండేలా జాగ్రత్త పడ్డారు. మరికొన్ని గదుల్లో ఈ ఉష్ణోగ్రత మరింత తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల గాలి చాలా వీస్తుంది. కాబట్టి ఫ్యాన్ అవసరం కూడా ఉండదు. “ఇల్లు పూర్తయి నివాసానికి సిద్ధంగా ఉంది. ముందు కాస్త కంగారు పడ్డాం. కానీ ఏప్రిల్, మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఇల్లు చల్లగా ఉంది. ఈ ‘కూల్ హౌస్’ తో మేము చాలా సంతోషంగా ఉన్నాం” అని ఆ ఇంటి యజమాని చెబుతున్నాడు.