చెత్తబుట్ట లేకుండా ఒక ఇంటిని ఊహించగలమా? అది కాని పనేమో కదా! కానీ ఇది సాధ్యమవునని నిరూపిస్తున్నది ముంబైకి చెందిన ఒక కుటుంబం. చెత్తబుట్టని వాడకుండా ఉన్న చెత్తని ఎలా ఉపయోగించుకోవచ్చునో చెబుతున్నారు.
పొడి చెత్త, తడి చెత్త ఇలా ఇంటికో చెత్తబుట్ట ఉంటుంది. అవికాకుండా ప్లాస్టిక్, ఇతర సామాగ్రి పడేయాడినికి మరొక బుట్ట.. ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అని చెత్తబుట్టలు ఉండడం మామూలైపోయింది. కానీ అసలు చెత్త బుట్ట లేకుండా ఇంటిని నెట్టుకొస్తున్నదో కుటుంబం. అదెలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత్తుతుంది కదా! కానీ ఐదు సంవత్సరాలుగా చేసి చూపిస్తున్నది ముంబైకి చెందిన సోనికా భాసిన్.
వంటగది వ్యర్థాలను కంపోస్ట్ చేయడం, బయోఎంజైమ్‌లను ఎంచుకోవడం, డిస్పోజబుల్స్‌ను నివారించడం, ప్యాకేజింగ్‌ను తగ్గించడంతో కొన్ని మార్పులు చేస్తే ఏదైనా సాధించవచ్చునంటున్నది సోనికా. ఆమె వంటగది కౌంటర్ మీద రోజు కూరగాయల చెత్తను సేకరించే ఒక కంటైనర్ ఉంటుంది. అది ఆమె బాల్కనీలో దాచిపెట్టిన మట్టి కంపోస్టర్ కోసం ఉద్దేశించబడింది. “కాలక్రమేణా, సూక్ష్మజీవులు, సరైన సమతుల్యతతో ఈ వ్యర్థాలు నల్ల బంగారంగా మారుతాయి – మన ఇంటి తోటను పోషించే గొప్ప కంపోస్ట్* అంటున్నది సోనికా. ఆమె తోటలో పుదీనా, తులసి, నిమ్మకాయలు, టమోటాలతో కుటుంబ భోజనానికి పోషకాలను అందిస్తుంది.

సోనికా చిన్న కొడుకు అబీర్ ఆమెకు సాయం చేస్తుంటాడు. ఇప్పటినుంచే వృథా చేయడం కాదు.. ఏదీ వృథా కానవసరం లేదనే పాఠాన్ని నేర్చుకుంటున్నాడు. సోనికా పర్యావరణ స్పృహతో కూడిన విధానం ఆమె ఇంటిలోని ప్రతీ అంశానికి విస్తరించింది. ప్రతీ రాత్రి రీసైక్లింగ్ కోసం పొడి చెత్తను జాగ్రత్తగా క్రమబద్ధీకరించడం నుంచి శానిటరీ ప్యాడ్‌లు, టిష్యూల వంటి పునర్వినియోగపరచలేని వాటిని నివారించడం వరకు ఆమె కుటుంబం తిరిగి ఉపయోగించలేని వాటిని తగ్గించే సూత్రంతో జీవిస్తున్నది.
“నేను అబీర్ చిన్నప్పుడు మెన్స్ట్రువల్ కప్పు, క్లాత్ నాప్కిన్లు ఉపయోగించాను. పునర్వినియోగ డైపర్లను కూడా ఎంచుకున్నాను” అని ఆమె వివరిస్తుంది. ఆమె ప్యాకేజింగ్ లేకుండా కిరాణా సామాగ్రిని కొనుగోలు చేస్తుంది. స్థానిక దుకాణాలకు సంచులను తీసుకెళుతుంది. పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌ను ఉపయోగించే భారతీయ బ్రాండ్‌లకు మద్దతు ఇస్తుంది. దుస్తులు కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన ఎంపికగా మారాయి.
A post shared by Sonika | Sustainable Lifestyle | Sustainable Parenting (@sonikabhasin)
పండ్ల తొక్కలు, బెల్లం నీటితో ఆమె మొక్కలకు మంచి మందుగా పని చేస్తుంది. ఆమె చేస్తున్న ప్రయత్నాలన్నీ కలిసి వచ్చాయి. ఐదు సంవత్సరాలుగా సోనికా కుటుంబం సాంప్రదాయ చెత్త డబ్బా లేకుండా ఇంట్లో పనులు చేసుకుంటున్నది. దీనికి సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేసింది.ఈ పరివర్తనకు “అబీర్ పుట్టడమే. మా వినియోగం గురించి పునరాలోచించుకునేలా చేసింది. నా బిడ్డ వ్యర్థంలో మునిగిపోతున్న గ్రహాన్ని వారసత్వంగా పొందాలని నేను కోరుకోలేదు” అని ఆమె అంటున్నది.
ఆమె జీవనశైలిని చూసి తన స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు కూడా చిన్న మార్పులను స్వీకరించారు. కంపోస్టింగ్ నుంచి పర్యావరణ అనుకూల పుట్టినరోజు పార్టీల వరకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నది. “నేను ప్రపంచాన్ని మార్చాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రతిరోజూ తీసుకునే సాధారణ ఎంపికలను చూసుకుంటే సరిపోతుంది” అని సోనికా చెప్పింది.