కావాల్సిన పదార్థాలు :
దోసకాయ : ఒకటి (పెద్దది)
టమాటలు: 2
పచ్చిమిర్చి: 4
ఉల్లిపాయ : ఒకటి (పెద్దది)
గసగసాలు : ఒక టీస్పూన్
ధనియాలు : ఒక టీస్పూన్
జీలకర్ర: ఒక టీస్పూన్
లవంగాలు : 4
యాలకులు: 2
దాల్చిన చెక్క : ఒక ఇంచు
కారం : ఒక టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు, నూనె : సరి పడినంత
తయారీ విధానం :
స్టెప్ 1: టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, దోసకాయ కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 2: స్టౌపై ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటలు కూడా వేసి ఉడికించుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు ఉడికించుకున్న ఈ మిశ్రమంను మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4: అదే కడాయిలో మరికొద్దిగా నూనె పోసుకొని దోసకాయ ముక్కల వేసి ఉడికించుకొవాలి. దోసకాయ ఉడికిన తర్వాత పసుపు, అల్లం వెల్లులి పేస్ట్, కారం వేసి కలుపుకొని 2 నిమిషాల తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేయాలి.
స్టెప్ 5: ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర కట్ చేసి ఒక నిమిషం తర్వాత దించేయాలి.