భారతదేశపు అభిమాన బ్రాండ్ మస్కట్‌లకు AI ప్రాణం పోసిన వీడియో వైర‌ల్‌!

అముల్ గర్ల్ లేదా నిర్మా గర్ల్ నిజ జీవితంలో ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తి ఆ ఉత్సుకతను మరింత పెంచాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో వారు మ‌నుషులైతే ఎలా ఉంటారోన‌నే ఒక వీడియోని విడుద‌ల చేశాడు. అది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది.

షాహిద్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఐకానిక్ ఇండియన్ బ్రాండ్ మస్కట్‌లను హైపర్-రియలిస్టిక్ రూపంలో తిరిగి ఊహించుకునే వీడియోను షేర్ చేశాడు. అది అప్పటి నుండి వైరల్ అయింది. ఇత‌డు 9 సంవ‌త్స‌రాలుగా క్రియేటివ్ డొమైన్ మీద ప‌ని చేస్తున్నాడు. ఈ ఒక్క వీడియోనే కాదు.. ఇత‌ని అకౌంట్‌లో మ‌రిన్ని ఆలోచించే వీడియోలు కూడా ఉన్నాయి. ఈ మ‌ధ్య హైదరాబాద్‌లో జ‌రిగిన హెచ్‌సీయూకి సంబంధించిన గొడ‌వ పై కూడా ఒక వీడియో చేశాడు.

ఇక ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో చీజ్ పిరమిడ్‌ను ఆస్వాదిస్తున్న అల్లరి అముల్ గర్ల్, బిస్కెట్ల కుప్పపై సంతోషంగా కూర్చున్న పార్లే-జి అమ్మాయి, తన సిగ్నేచర్ మర్యాదపూర్వక చిరునవ్వును అందిస్తున్న ఎయిర్ ఇండియా నుండి మహారాజా క‌నిపిస్తారు. అంతేకాదు.. ఉత్సాహభరితమైన నిర్మా గర్ల్ తన క్లాసిక్ వైట్ పోల్కా-డాట్ ఫ్రాక్‌లో మధ్యలో నృత్యం చేస్తూ కనిపిస్తుంది.

View this post on Instagram

A post shared by Sahid SK (@sahixd)

ఇవేకాదు.. భారతీయ రైల్వే గార్డు మస్కట్ భోలు నిశ్శబ్ద ప్లాట్‌ఫామ్‌పై లాంతరు పట్టుకుని ఉండగా, ఆసియన్ పెయింట్స్‌కు చెందిన గట్టు మిడ్-స్ట్రోక్‌లో బంధించబడి గోడకు ప్రకాశవంతమైన ఎరుపు రంగును పెయింట్ చేస్తున్నట్లు మనం చూస్తాము. 7UP నుంచి ఫిడో డిడో, చీటోస్ నుండి చెస్టర్ చీతా వంటి అంతర్జాతీయ మస్కట్‌లు కూడా కనిపిస్తాయి. “నిజ జీవితంలో ఐకానిక్ బ్రాండ్ మస్కట్‌లను తిరిగి ఊహించుకోవడం. ఐకానిక్ మస్కట్‌లను తిరిగి ఊహించుకోవడానికి AIని ఉపయోగించాలని నేను అనుకున్నాను.. ఫలితాలు చాలా ఆకట్టుకుంటున్నాయి అంటూ పోస్ట్‌కి శీర్షిక రాశాడు.

ఈ వీడియోని చూసిన సోష‌ల్ మీడియా వినియోగులంద‌రూ.. “పార్లే జి అమ్మాయి చాలా ముద్దుగా ఉంది, నిర్మా అమ్మాయి కూడా అద్భుతంగా ఉంది” అని ఒకరు కామెంటారు. మరొక యూజర్ “చివరకు నువ్వు వాళ్ళని బ్రతికించావు” అని అంటూ రాసుకొచ్చారు. “నేను వాళ్ళని చిన్నప్పుడు ఎలా ఊహించుకున్నానో అలాగే ఉంది” అని ఒక యూజర్ అన్నారు. మిలియ‌న్ లైక్‌ల‌కు నిజంగా ఈ వీడియో అర్హ‌మైన‌దే అనిపిస్తుంది. ఒక‌సారి మీరు ఇంకా చూడ‌క‌పోతే దానిపై ఓ లుక్కేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress