కావాల్సిన పదార్థాలు :
గోధుమ పిండి: ఒక కప్పు
నెయ్యి: 2 టీస్పూన్లు
నూనె : అర కప్పు
మిల్క్ పౌడర్: అర కప్పు
బెల్లం : ఒక కప్పు
వెనీలా ఎసెన్స్: అర టీస్పూన్
పెరుగు: అర కప్పు
బాదం, పిస్తా: అర కప్పు
బేకింగ్ సోడా: ఒక టీస్పూన్
బేకింగ్ పౌడర్: ఒక టీస్పూన్
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా బెల్లం తురిమి పెట్టుకోవాలి. బాదం, పిస్తా చిన్నగా కట్ చేసుకోవాలి.
స్టెప్2: ఒక గిన్నెలో నెయ్యి, నూనె,పెరుగు, వెనీలా ఎసెన్స్, తురిమిన బెల్లం వేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి.
స్టెప్ 3: ఆ తర్వాత గోధుమ పిండి, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి. ఈ మిశ్రమం ఉండలు లేకుండా కొంచెం జారుగా కలుపాలి. అవసరం అయితే కొన్ని పాలు పోసి కలుపండి.
స్టెప్ 4: స్టౌ మీద పెనం పెట్టి సన్నని మంట మీద 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. కుక్కర్ లోపల ఒక టీ స్పూన్ నెయ్యి రాసి ఇప్పుడు కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమంను వేసుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు ఒకసారి బుడగలు లేకుండా ఒకసారి ట్యాప్ చేయాలి. ఆ తర్వాత పై నుంచి బాదం, పిస్తా వేసుకోవాలి.
స్టెప్ 6: కుక్కర్ మూత పెట్టి విజిల్ లేకుండా కనీసం 50 నిమిషాలు ఉంచాలి. స్టౌ ఆపేసిన తర్వాత ఒకసారి టూత్‌పిక్‌తో గుచ్చి చూస్తే కేక్ అయిందో లేదో తెలిసిపోతుంది. అంతే యమ్మీ కేక్ రెడీ అయిపోతుంది.