ఈ దేశీయ సీజన్లో సురుచి ఫోగట్ తిరుగులేని ప్రదర్శన కనబరుస్తోంది. 18 ఏళ్ల పిస్టల్ షూటర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో మూడు వ్యక్తిగత టైటిళ్లను కైవసం చేసుకుంది. అంతేకాదు.. జాతీయ క్రీడలలో స్వర్ణం సాధించి అందరి చూపు తనవైపు తిప్పుకున్నది.
కేరళలో జరిగిన 2017 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మను భాకర్ గుర్తుందా? ఇప్పుడు సురుచి ఫోగట్ కూడా ఇదే విధమైన అద్భుతమైన పురోగతిని సాధించింది. ఆమె బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన ISSF ప్రపంచ కప్‌ను లక్ష్యంగా చేసుకొని తన ప్రదర్శన కొనసాగించింది. కమాండింగ్ ప్రదర్శనతో తన మొదటి ప్రపంచ కప్ స్వర్ణాన్ని గెలుచుకుంది సురుచి. మను కూడా పోటీలో ఉంది కానీ ఎనిమిది మంది షూటర్ల ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.
నేను దేశీయ పోటీలలో చాలా మంచి స్కోర్లతో టోర్నమెంట్లోకి వచ్చాను. అది నాకు మంచి ఫామ్‌లో ఉండడానికి సహాయపడింది. నేను నా షూటింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. ఎటువంటి ఒత్తిడిని అనుభవించలేదని సురుచి చెప్పింది.

సురుచి ప్రస్థానం..
2019లో హర్యానాలోని ఝజ్జర్‌లోని సస్రోలి గ్రామం నుంచి ఆమె విజయ ప్రయాణం ప్రారంభమైంది. ఆమె అకాడమీలో శిక్షణ పొందింది. అక్కడ డబుల్ పారిస్ గేమ్స్ పతక విజేత మను భాకర్ కోచ్ అయిన సురేష్ సింగ్ వద్ద తన ప్రారంభ పాఠాలను నేర్చుకుంది. ఆమె తండ్రి ఇందర్ సింగ్, రిటైర్డ్ ఆర్మీమెన్, మొదట సురుచిని రెజ్లింగ్‌కు పరిచయం చేశాడు. కానీ ఆ తర్వాత గాయం కారణంగా ఆమె తిరిగి మైదానంలోకి రాలేదు. షూటింగ్ ఆమె ప్రశాంతమైన ప్రవర్తనకు తోడుగా నిలిచింది.
సురుచి 2023లో జూనియర్ ఇండియా జట్టుకు ఎంపికైంది. జర్మనీలోని సుహ్ల్‌లో జరిగిన జూనియర్ ప్రపంచ కప్‌లో మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుచుకుంది. ఆమె గత సంవత్సరం ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో కూడా పోటీ పడింది. “సీనియర్ సర్క్యూట్లో పోటీ చాలా కఠినమైనది. ఆసియా ఛాంపియన్‌షిప్‌ల తర్వాత నేను తీవ్రంగా శిక్షణ పొందాను” అని సురుచి చెప్పింది.
ఈ సీజన్లో ఇవన్నీ కలిసి వచ్చాయి. సంవత్సరం సురుచి స్థిరంగా మంచి స్కోర్లను నమోదు చేసింది. “కష్టపడి చేసిన పని ఫలించింది. ఆమె చాలా క్రమశిక్షణతో ఉంటుంది. తన శిక్షణపై దృష్టి పెట్టింది. ఆమె బ్యూనస్ ఎయిర్స్ వెళ్ళినప్పుడు ఆమె ఫోన్‌కు దూరంగా ఉండేది” అని తండ్రి ఇందర్ సింగ్ చెప్పారు.