పుల్ల‌పుల్ల‌ని మామిడి కాయ ప‌చ్చి పులుసు టేస్ట్ అదిరిపోతుంది!

కావాల్సిన ప‌దార్థాలు :
మామిడికాయ‌లు: 2
జీల‌క‌ర్ర‌: ఒక‌ టీస్పూన్
ఆవాలు: ఒక‌ టీస్పూన్
ఉల్లిపాయ :1
ప‌చ్చిమిర్చి: 4
ఎండుమిర్చి : 2
క‌రివేపాకు: 2 రెమ్మ‌లు
కొత్తిమీర‌: చిన్న క‌ట్ట‌
జీల‌క‌ర్ర మెంతుల పొడి: ఒక‌ టీస్పూన్
ఉప్పు, నూనె : స‌రిప‌డినంత‌
నీళ్లు: ఒక‌ లీట‌ర్

త‌యారీ విధానం :
స్టెప్1:
కుక్క‌ర్‌లో మామిడి కాయ‌లను నీళ్లు పోసి 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉంచి ఉడికించుకోవాలి. ఉల్లిగ‌డ్డని క‌ట్ చేసి పెట్టుకోవాలి
స్టెప్2: స్టౌపై ప‌చ్చిమిర్చిని కాల్చుకొని మెత్త‌గా గ్రైండ్‌ చేసుకొవాలి. ఉడికించుకున్న మామిడికాయల‌ను కూడా మెత్త‌గా చేసి గుజ్జు తీసుకొని పులుపు చూసుకొని మ‌న రుచికి స‌రిప‌డిన‌ట్టుగా నీళ్లు పోసుకోవాలి.
స్టెప్ 3: ఇందులో గ్రైండ్ చేసుకున్న ప‌చ్చిమిర్చి క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ, ఉప్పు వేసుకొని క‌లిపి ప‌క్క‌న పెట్టుకోవాలి.
స్టెప్4: స్టౌపై వేరే చిన్న క‌డాయిలో నూనె పోసుకొని వేడ‌యిన‌ త‌ర్వాత జీల‌క‌ర్ర‌, ఆవాలు, ప‌సుపు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి పోపు పెట్ట‌కోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర క‌ట్ చేసి క‌లుపుకుంటే ఆహా ఏమి రుచి అన‌క‌మాన‌రు!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress