మ‌నుషుల్లాగే మాట్లాడుతున్న కాకి వీడియో వైర‌ల్‌!

చిలుక ప‌లుకులు అన్న‌ట్లుగానే.. ఇప్పుడు కాకి ప‌లుకులు అనాలేమో! తెలుగు సినిమాల్లోలాగా కాకి ఇప్పుడు అంత‌టా పాపుల‌ర్ అయిపోయింది. మాట్లాడుతున్న ఆ కాకి సంగ‌తేంటో చ‌దువండి..

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం గురించే ఇప్పుడు దేశ‌మంతా చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. ఎందుకంటే వారు ఒక కాకిని పెంచుకుంటున్నారు. అంతేకాదు.. ఇక్క‌డ ఆ కాకి మాట్లాడుతుండ‌డం విశేషం. ఆ కాకికి సంబంధించిన వీడియోను నెట్టింట పెట్టిందా కుటుంబం. దీంతో ఆ కాకి, ఆ కుటుంబం వైర‌ల్ అయ్యారు.

ఒక‌రోజు.. మాంగల్య ముంకే ఒక చెట్టు కింద 15 రోజుల వయసున్న గాయపడిన కాకిని కనుగొని ఇంటికి తీసుకువచ్చింది. కాలక్రమేణా కాకి.. ముంకే కుటుంబంలో భాగమైంది. పిల్లలు దానికి ఆహారం పెడుతూ, ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు. అంతేకాదు.. వారు దానితో మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నించేవారు. వాళ్ల‌ని గ‌మ‌నించిన ఆ కాకి కూడా మెల్ల‌మెల్ల‌గా మాట్లాడ‌డం ప్రారంభించింది. మరాఠీలో “ఆయ్” (తల్లి), పాపా” (తండ్రి) వంటి పదాలు, మరియు “నువ్వు ఏం చేస్తున్నావు?” వంటి పదబంధాలను కూడా చెప్పేది. “నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు?ష‌ అంటూ వ‌చ్చిన‌వాళ్ల‌ని అడుగుతూ ఉంటుంది.

కాకి మాట్లాడే వీడియోలు వైరల్ కావడంతో సమీప గ్రామాల ప్రజలు ఆ కుటుంబాన్ని, కాకిని చూడ‌డానికి త‌ర‌లి వ‌స్తున్నారు. ముంకే కుటుంబ స‌భ్యుల‌ను చెబుతుంది. అయితే ఆ కాకి ముంకే కుటుంబం అడిగితే మాత్ర‌మే స‌మాధానమిస్తున్న‌ది. వేరే ఎవ‌రైనా అడిగితే మాత్రం మీ ప‌ని ఏమిటంటూ ఆ కాకి అడిగేస్తుంది. ఈ కాకి ఇతర కాకులతో ఎగురుతూ రోజంతా గడిపినప్పటికీ సూర్యాస్తమయానికి ముందే ఇంటికి తిరిగి వస్తుంది. కుటుంబానికి దగ్గరగా ఉంటుంది.

ఈ వీడియో గురించి మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తున్న‌ది. చాలామంది ఆ కాకిని, ఆ కుటుంబాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రేమో ఇంక చిలుక‌ల ప‌ని అయిపోయిన్న‌ట్లే అంటూ కామెంటుతున్నారు. ఏది ఏమైనా ఈ వింత కాకిని చూస్తే మాత్రం నిజంగా ఔరా అని అనాల్సిందే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress