ఒక అద్భుతమైన వంట సాధనలో.. ప్రఖ్యాత మాస్టర్ చెఫ్ అబినాస్ నాయక్, చెఫ్ రచిత్ కీర్తిమాన్, రచయిత రోషన్ బిసోయ్లతో కలిసి అతిపెద్ద పఖాలా స్ప్రెడ్‌ని తయారు చేశారు. ఒడిశాకి చెంది ఈ వంటకాలను ది క్రౌన్, IHCL సెలక్షన్స్‌తో కలిపి ఒక రికార్డు నెలకొల్పారు.
పఖాలా దిబాస (మార్చి 20)న చేస్తుంటారు. ఆ రోజున ఒడిశా ప్రజలు పులియబెట్టిన బియ్యం వంటకం పఖాలాను చేయడం ఆనవాయితీ. అయితే దాన్ని వేడుకగ 190 వంటకాలను చేశారు. ఒడిశా వంటకాలు ప్రపంచ గుర్తింపును తీసుకురావడం కోసం ఈ వెరైటీలను తయారు చేసినట్లు చెఫ్‌లు చెబుతున్నారు. దేశీయ బియ్యం రకాలను ఉపయోగించి తయారుచేసిన పఖాలా 15రకాల కంటే ఎక్కువ ప్రత్యేకమైన వైవిధ్యాలు ఈ స్ప్రెడ్‌లో ఉన్నాయి.
తరతరాలుగా ఒడియా గృహాల్లో ప్రధానమైన పఖాలా.. రిఫ్రెషింగ్, ప్రోబయోటిక్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా.. నాయక్, అతని బృందం ప్రపంచవ్యాప్తంగా ఒడియాలకు గర్వకారణంగా ఈ వంటకాలను ప్రజెంట్ చేశారు. ఒడియా పదార్థాల వైవిధ్యాన్ని, పఖాలా సామాజిక-ఆర్థిక ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి ఒక శక్తివంతమైన వేదికగా పనిచేసింది. ఒడిశాలో.. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతితో పాటు మంచి వంటకాలు కూడా ఉంటాయి.

పఖాలా దిబాస మూలాలు దశాబ్దం క్రితం సోషల్ మీడియాలో ఒడియాస్ ప్రారంభించిన ఉద్యమం నుంచి వచ్చాయి. ఒడియా వంటకాలను ప్రపంచ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఇది మొదలైంది. పఖాలాకు ఒడిశాలో లోతైన చారిత్రక మూలాలు ఉన్నాయి. దీనిని తరచుగా ఆలయ ఆచారాలలో భాగంగా జగన్నాథుడికి వడ్డిస్తారు. పఖాలా కేవలం ఒక వంటకం కంటే ఎక్కువగా, ఒడియా సంస్కృతి సారాంశాన్ని కలిగి ఉంది. వివాహాలు, అంత్యక్రియలు, కుటుంబ సమావేశాలలో అంతర్భాగంగా ఉంది.
ఈ రికార్డు కార్యక్రమంలో భాగంగా.. మీఠా పఖాలా (తీపి), దహి పఖాలా (పెరుగుతో), సజా పఖాలా వంటి క్లాసిక్ వెర్షన్లు ఈ వంటకాల్లో భాగమయ్యాయి. పఖాలా స్ప్రెడ్‌తో పాటు చికెన్ బేసర భజ్జా, అలు భర్త, సాగా భజా, ఛతు బేసర, మచా భజా, అంబుల రాయ్ వంటి రుచికరమైన సైడ్ డిష్‌ల శ్రేణిని అందించారు. పఖాలా అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రతి సైడ్ డిష్‌ను చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు.
“ఇది కేవలం రికార్డు సృష్టించడం గురించి కాదు. ఇది మన మూలాలను గౌరవించడం, ఒడియా వంటకాల రుచులను ప్రపంచానికి చూపించడం గురించి. పఖాల అనేది ఒక వంటకం కంటే ఎక్కువ. ఇది ఒక జీవన విధానం” అని చెబుతూ నాయక్ ఈ పాకశాస్త్ర ఘనత ప్రాముఖ్యతను చెప్పారు.
పఖాలా ఒడిశా గృహాల్లో ఏడాది పొడవునా ప్రధానమైన వంటకంగా ఉన్నప్పటికీ.. ఎండకాలం నెలల్లో దాని ప్రజాదరణ పెరుగుతుంది. వేడి నుంయి ఉపశమనం పొందేందుకు ఈ వంటకాలను తయారుచేస్తారు. ఆరోగ్య నిపుణులు కూడా పఖాలా పోషక ప్రయోజనాలను ప్రశంసిస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ కంటెంట్ కారణంగా ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండే పఖాలా జీర్ణక్రియకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది, ఇది వేసవి వంటకంగా ఆదర్శవంతమైనది.
ఈ సంవత్సరం పఖాలా దిబాస వేడుకలు ఒడిశా ఐకానిక్ వంటకాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో నిజంగా విజయవంతమయ్యాయి.