ఇషాన్‌ కిషన్‌ను ఇష్క్‌లో పడేసిన ఆ అందమైన అమ్మాయి ఎవరో తెలుసా?

ఐపీఎల్‌లో ఈరోజు స్టార్ ఎవ‌రంటే ఇషాన్ కిష‌న్ పేరే చెబుతారు. సెంచ‌రీ కొట్టి SRH ని నిల‌బెట్టి అంద‌రి మ‌న‌సులు దోచాడు. మ‌రి ఈ స్టార్ క్రికెట‌ర్ మ‌న‌సు దోచింది ఎవ‌రో తెలుసా? ఆమె గురించే ఈ స్టోరీ..

ఆహ్.. ఐపీఎల్ మాయాజాలం మొద‌లైంది. తెలుగు వారి ఫేవ‌రెట్ టీమ్ SRH మొద‌టి మ్యాచ్ గెలిచింది. ఆ గెలుపున‌కు ప్ర‌ధాన కార‌ణం ఇషాన్ కిష‌న్ సెంచ‌రీ. త‌న అద్భుత‌మైన ఆట‌తో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన ఆ క్రికెట‌ర్ మ‌న‌సు దోచిన అమ్మాయి పేరు అదితి హుండియా. ఈమె ఎవ‌రు.. ఏంటి? ఏం చేస్తుందంటూ అంతా నెట్టింట వెతికేస్తున్నారు. మ‌రి ఆమె గురించి తెలుసుకోక‌పోతే ఎలా?

ఇషాన్ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన అమ్మాయి అదితి. ఆమె ఒక ఫ్యాష‌న్ ఐకాన్‌. జైపూర్‌కు చెందిన అదితి అందాల పోటీల్లో పాల్గొన్న‌ది. ఆమె మిస్ ఇండియా 2017 లో ఫైనలిస్ట్, తరువాత 2018 లో మిస్ సుప్రానేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. ప్రతి దుస్తులలోనూ ఆమె తాను స్టైల్ రాణి అని నిరూపించుకుంటూనే ఉంది. ఎందుకంటే ఆమెకు ప్ర‌త్యేక ఫ్యాష‌న్ లేబుల్ ఉంది. అందుకే అభిమానులను, విమర్శకులను కూడా ఆశ్చర్యపరిచే బోల్డ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లు చేస్తోంది.

మిస్ ఇండియా నుండి ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ వరకు.. అదితి ర్యాంప్‌పై నడుస్తూ, పోటీలలో అద్భుతంగా పాల్గొంటూ అభిమానుల హృదయాల్లో త‌న‌దైన ముద్ర వేసింది. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 289,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఉంది. అదితి క్రమం తప్పకుండా ఫోటోషూట్‌లను పోస్ట్ చేస్తుంది. వీరి ప్రేమ‌క‌థ 2019లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అదితి ఇషాన్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించడంతో ఇదంతా ప్రారంభమైంది. ఆ క్షణం నుండి, ఇద్దరూ వివిధ కార్యక్రమాలలో కలిసి కనిపించారు. అంతేకాదు.. అదితి ఫొటోకి ఇష‌న్ బ్యూటీఫుల్ అని కామెంట్ పెట్ట‌డంతో వీరి ప్రేమ‌ను అంద‌రూ ధృవీక‌రించారు. ఇషాన్, అదితి ఇద్దరూ స్పాట్‌లైట్‌ను ఎంత ఆస్వాదిస్తున్నారో, వారి రహస్యాన్ని కూడా అంతే ఆస్వాదిస్తున్నారు. వారి సంబంధాన్ని బహిరంగంగా ధృవీకరించకపోయినా, వారి మధ్య కెమిస్ట్రీ కాదనలేనిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress