అవకాడోతో వంటకాలు చేయడం తెలుసు. కానీ అద్భుతమైన అందాన్ని పొందవచ్చని తెలుసా? కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
స్మూతీలు చేసుకోవడం, మిల్క్ షేక్లతో, టోస్ట్‌ల మీద అవకాడోలను వాడడం చేస్తుంటాం. ఖరీదైన ఈ పండును ఆరోగ్యం కోసమే కాదు.. అందం కోసం కూడా వాడుకోవచ్చు. కేవలం అవకాడో పేస్ట్‌తో కొన్ని రోజులు పెదాల మీద రాసి చూడండి. కొన్నిరోజుల్లో లిప్ స్టిక్ కూడా అవసరం ఉండదు. అధిక పోషకాలు ఉన్న ఈ అవకాడోతో వేసే ఫేస్ మాస్క్‌ల గురించి చదువండి.
- అవకాడోను పేస్ట్ లా చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల ఓట్ మీల్ కలిపి ముఖానికి, మెడకు రాయాలి. కాసేపు అలాగే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. ఇక్కడ ఓట్ మీల్ పొడి, సెన్సిటివ్ స్కిన్ వారికి ఇది కొంత దురద కలిగించొచ్చు. అలా అనిపిస్తే మాత్రం వెంటనే కడిగేసుకోవడం మంచిది.
- చర్మం మృదువుగా మారాలంటే ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే! అవకాడో పేస్ట్లా చేయాలి. దీంట్లో హెంప్ ఆయిల్ కలుపాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపు ఉంచి కడిగేయాలి. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది.
- అవకాడోలో పెరుగు, పసుపు వేసి కలుపాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అవకాడో చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఈ ప్యాక్ ని ముఖానికి రాసి ఆరనివ్వాలి. పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తుండాలి.
- చర్మం జిడ్డు కారుతుందా? అయితే ఈ ప్యాక్ మీకోసం. యాక్నే సమస్య ఉన్నవాళ్లు ఈ ప్యాక్ వేసుకోండి. అవకాడో పేస్ట్, క్లే పౌడర్, కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని కలుపాలి. ఇది ముఖానికి రాసి కాసేపు ఆగి కడుగాలి. కనీసం 20 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాతనే కడుగాలి.