ఎక్కువగా టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రపంచంలో చాలామంది ఇష్టపడే పానీయాల్లో ఒక‘టీ’. పాలు, చక్కెరతో నిండిన తియ్యని పానీయం. దీనిని తేనీరు అని ముద్దుగా పిలుచుకుంటారు. కానీ దీన్ని ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో తెలిస్తే మాత్రం టీ జోలికి వెళ్ల‌రు.

‘చాయ్ చమక్కులే చూడ రా బాయ్..’ అంటూ పాటలు పాడుకోవడం విన్నాం. పైగా కాలంతో ప‌నిలేకుండా.. ఏ కాలంలోనైనా చాయ్ ప‌డందే రోజు గ‌డువ‌దు చాలామంది. కొంద‌రైతే టైంతో ప‌నిలేకుండా టీ ని జుర్రేస్తుంటారు. అయితే మోతాదుకు మించితే ఏదైనా మంచిది కాదని నానుడి ఉంది. ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ చాయ్.. ఎక్కువ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు.

ఒత్తిడి..
కెఫీన్ అనేద టీ ఆకుల్లో ఒక సేంద్రీయ భాగం. కెఫీన్ ను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుంది. ఒత్తిడి, చంచలత స్వభావం వంటి భావాలు తీవ్రమవుతాయి.

మలబద్ధకం..
టీలోని థియోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. టీని ఎక్కువ తాగడం వల్ల మలబద్ధకాన్ని కలిగిస్తుంది.

మంటను..
టీలో కెఫిన్ ఉంటుందని తెలుసు కదా! ఇది లోపల ఉన్న యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. లేదా గుండెల్లో మంటను ప్రేరేపిస్తుంది. అదనంగా.. కడుపులో ఆమ్లం మొత్తాన్ని పెంచుతుంది.

నిద్ర..
నిద్ర అలవాట్లను కెఫిన్ ప్రభావితం చేస్తుంది. అలసట, జ్ఞాపకశక్తి కోల్పోవడం, శ్రద్ధ లోటు వంటి రుగ్మతలను పెంచుతుంది. మానసిక పరిస్థితి సరిగ్గా లేకుండా చేస్తుంది.

గర్భధారణ..
టీ గర్భస్రావం లేదా శిశువు బరువు తక్కువ అయ్యేలా చేస్తుంది. ప్రెగ్నీన్సీ కోసం ప్రయత్నిస్తుంటే మాత్రం టీ అస్సలు తాగకపోవడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress