పోల్కాడాట్ డ్రెస్‌ల‌కి.. ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందా?

కియారా అద్వానీ గ‌ర్భం దాల్చిన‌ట్టు గుడ్‌న్యూస్ ప్ర‌క‌టించింది. అయితే దీనికి పోల్కాడాట్ థియ‌రీ పనిచేసిందంటూ అంద‌రూ నెట్టింట కామెంటుతున్నారు.

2020లో అనుష్క‌శ‌ర్మ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది. ఆ స‌మ‌యంలో విరాట్ తెల్ల‌ని దుస్తుల్లో, అనుష్క న‌ల్ల‌ని డ్రెస్ మీద తెల్ల‌ని పోల్కాడాట్ డ్రెస్ వేసుకొని ఉన్న‌ది. ఆ స‌మ‌యానికే అనుష్క ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. అప్పుడు మొద‌లైంది ఈ ట్రెండ్‌.


హార్దిక్‌, న‌టాషా త‌మ ప్రెగ్నెన్సీ అనౌన్స్ స‌మ‌యంలో కూడా ఇదే పోల్కాడాట్ డ్రెస్ ట్రెండ్‌ని ఫాలో అయ్యారు. అలాగే క‌రీనాక‌పూర్ ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో త‌న వార్డ్ రోబ్‌లో ఇదే న‌లుపుతెలుపు కాంబినేష‌న్‌లో ఉన్న పోల్కాడాట్ డ్రెస్‌ని చేర్చింది. దీంతో పోల్కాడాట్ థియ‌రీ ప‌ని చేసిందంటూ సోష‌ల్‌మీడియాలో చాలా చ‌ర్చ జ‌రిగింది. దీనికి మ‌రింత బ‌లం చేకూరేలా అలియా త‌న ప్రెగ్నెన్సీని తెలిపే కొన్ని నెల‌ల ముందు అచ్చు ఇలాగే పోల్కాడాట్ టాప్ వేసుకొని క‌నిపించింది. ఇప్పుడు కియారా కూడా రెండు నెల‌ల క్రితం క్రిస్‌మ‌స్ రోజు పోల్కాడాట్ డ్రెస్ వేసుకోవ‌డం వ‌ల్లే ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిందంటూ నెట్టింట అంద‌రూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ భామ‌లు త‌ల్లికావాల‌న్నా లేదా త‌ల్లికావాల‌ని ప్ర‌క‌టించాల‌న్నా ఇప్పుడు పోల్కాడాట్ థియ‌రీ కంప‌ల్స‌రీ అన్న‌ట్లుగా మారిపోయింది.


కియారా, సిద్ధార్థ్ 2021 షేర్షా సినిమాలో ఆన్‌స్క్రీన్ క‌పుల్‌గా క‌నిపించారు. ఆ స‌మ‌యంలో స్నేహం చిగురించి ఆ త‌ర్వాత రెండు సంవ‌త్స‌రాల పాటు డేటింగ్ చేశారు. 2023లో వివాహ‌బంధంతో ఒక్క‌ట‌య్యారు. పెండ్ల‌య్యాక రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు కియారా త‌ల్లికాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress