డబుల్ చిన్ సమస్యకి ఈ వ్యాయామాలు చేయండి!


ఆరోగ్యంగా.. ఫిట్ గా ఉండాలంటే వ్యాయామాలు చాలా ముఖ్యమైనవి. డబుల్ గడ్డం తగ్గించడంలో కొన్ని ఉత్తమమైన మార్గాలున్నాయి.


రోజు వారీ పనుల్లో వ్యాయామం కూడా తప్పనిసరి. డబుల్ చిన్ సమస్య ఉన్నవాళ్లు ఇతర వ్యాయామాలతో పాటు ప్రత్యేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..

  1. గడ్డం కింద టెన్నిస్ లేదా క్రికెట్ బాల్ ఉంచండి. ఇప్పుడు బంతిని గొంతు పై నొక్కిన విధంగా మీ ముఖాన్ని ఉంచండి. ఈ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా 25‌ నుంచి 30సార్లు చేయండి. ఈ వ్యాయామం వల్ల అదనపు కొవ్వు తగ్గుతుంది. ఎప్పటి నుంచో కోరుకునే పర్ఫెక్ట్ షేప్ ఫేస్ మీ సొంతమవుతుంది.

2. ఈ వ్యాయామానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. ఇది చేయడం సులభం. డబుల్ చిన్ తగ్గించుకోవడానికి లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత గడ్డం ఎడమ భుజానికి వంచండి. అప్పుడు దానిని తిరిగి మధ్యలోకి లాగి కుడి భుజానికి వంచండి. ఈ వ్యాయామాన్ని 5 నుంచి 10 నిమిషాలు చేయండి.


3. ఈ వ్యాయామం చేయడానికి మీరు పై కప్పును చూస్తుండాలి. ఆ తర్వాత ఈ స్థితిలో ఉంటూనే దంతాలను గ్రైండ్ చేసినట్టు కింది దవడను ముందుకు సాగదీయాలి. సుమారు 10 సెకన్ల పాటు ఈ స్థితిలో ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. మళ్లీ కాసేపటి తర్వాత ఇలాగే చేయాల్సి ఉంటుంది.


4. ఈ వ్యాయామం దవడ, గొంతు, మెడతో సహా చాలా ముఖ కండరాలను సాగదీయంలోసహాయపడుతాయి. ఈ వ్యాయామం చేసేటప్పుడు మీ పెదాలను మాత్రమే ఉపయోగించాలి. తలను పైకి ఎత్తి పై కప్పును ముద్దడాతున్నట్లుగా పెదాలను బిగుతుగా చేయండి. మెరుగైన ఫలితాలం కోసం ఈ వ్యాయామాన్ని 10 నుంచి 20 సార్లు చేయండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress