అల్పాన్సో నుంచి హిమ‌సాగ‌ర్ వ‌ర‌కు ఏ మామిడి పండ్లు ఎక్క‌డ దొరుకుతాయి?!

వేస‌వి అంటేనే మామిడి పండ్ల సీజ‌న్ అని అర్థం! పండ్ల రారాజుగా పిలిచే మామిడి పండ్ల సీజ‌న్‌లో వ‌చ్చే అన్ని పండ్ల‌ను ఒకేసారి తిన‌లేము. అలాంటి పండ్లు ఎక్క‌డ దొరుతాయో తెలుసుకొని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి.

వేసవి సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వ‌స్తున్న‌ప్పుడు ప‌చ్చ‌ని మామిడి క‌ట్ చేసి ఉప్పు, కారం పెట్టి అమ్మేవాళ్ల‌ను చూసే ఉంటారు. ఇంట్లో అమ్మ ర‌సం పిండి జ్యూస్ చేసే రోజులు గుర్తున్నాయా? అస‌లు మామిడి కాయ‌, పండు ఏదైనా త‌లుచుకోగానే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి క‌దా! మామిడి పండు అంటే ఒక‌ర‌మైన భావోద్వేగం. ఆ పండు ఉంటే ఇండ్ల‌లో ప్ర‌తిరోజూ పండుగే. అస‌లు భార‌త‌దేశంలోనే దాదాపు 1500ర‌కాల మామిడి పండ్లు దొరుకుతాయ‌ని మీకు తెలుసా? అందులో 9 ర‌కాలు మీకోసం..

1. దశేరి

ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండే ద‌శేరి. దీనిని లక్నో నవాబులు సుమారు 2000 సంవత్సరాల క్రితం ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు.

ఎలా గుర్తించాలి: ఇది తియ్యగా, పొడవుగా, ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది.

అందుబాటులో : ఏప్రిల్ నుంచి జూన్ వరకు.

2. లాంగ్రా

భారతదేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో చాలా మందికి ఇష్టమైన మామిడి పండు బనారసి లాంగ్రా. దీనిని మొదట ఒక దివ్యాంగుడు పండించాడని చెబుతారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

ఎలా గుర్తించాలి: ఇది కాస్త పుల్ల‌గా, కోడిగుడ్డు ఆకారంలో, ఆకుప‌చ్చ‌గా  ఉంటుంది (పండిన తర్వాత కూడా).

అందుబాటులో: జూలై నుంచి ఆగస్టు వరకు.

3. కేస‌ర్

రుచికరమైన ఆమ్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన మామాడి పండు కేస‌ర్‌. గుజరాత్‌లో ప్రధానంగా గిర్నార్ పర్వతాలలో ఈ పండు లభిస్తుంది. ఇది ఖరీదైన రకాల్లో ఒకటి.

ఎలా గుర్తించాలి: ఇది ప్రకాశవంతమైన నారింజ రంగు, విచిత్రమైన తీపి వాసన కలిగి ఉంటుంది.

అందుబాటులో: ఏప్రిల్ నుంచి జూలై వరకు.

4. పైరి

భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది పైరి. దాని తీపిని సమతుల్యం చేయడానికి అల్ఫోన్సోతో క‌లిపి తింటుంటారు. ఈ పైరి పండును జ్యూస్‌లా కూడా తీసుకుంటారు.

ఎలా గుర్తించాలి: ఇది చిన్నగా, గుండ్రంగా, ఆకుపచ్చ ఎర్రటి రంగుల క‌ల‌యిక‌తో ఉంటుంది.

అందుబాటులో: ఏప్రిల్ నుండి జూన్ వరకు

5. చౌన్సా

ఇది కూడా పాత ర‌కం మామిడే! షేర్ షా సూరి 16వ శతాబ్దంలో తన పాలనలో ఈ రకాన్ని ప్రవేశపెట్టాడు. బీహార్‌లోని ఒక జిల్లా పేరు ఈ పండుకు పెట్టాడు.

ఎలా గుర్తించాలి: ఇది గుజ్జులా, గుండ్రంగా, ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉంటుంది.

అందుబాటులో : జూన్ నుంచి ఆగస్టు వరకు

6. తోతాపురి

దీనిని అనేక పేర్లతో పిలుస్తారు: గిల్లి, కల్లమై, సాండర్సా, బెంగళూరు ర‌కం ఇలా చాలా పేర్ల‌తో పిలుస్తారు. ఇది 1901లో ఫ్లోరిడాకు ఎగుమతి చేయబడిన మొద‌టి ర‌కంగా పేరు తెచ్చుకుంది. ఇది ఆండర్సన్, బ్రూక్స్ మామిడి రకానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది.

ఎలా గుర్తించాలి: చిలుక ముక్కు లాంటి, త‌క్కువ తియ్య‌గా ఉంటుంది. .

అందుబాటులో : ఏప్రిల్ నుంచి జూన్ వరకు

7. బంగిన‌ప‌ల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో ఈ పండ్ల సాగు చేస్తారు. లోప‌ల తెల్ల‌ని రంగు నుంచి లేత పసుపు రంగులోకి మారుతుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది.

ఎలా గుర్తించాలి: ఇది గుండ్రంగా, బొద్దుగా, లేత పసుపు రంగులో ఉంటుంది.

అందుబాటులో : ఏప్రిల్ నుంచి జూన్ వరకు

8. సింధ్రి

‘మామిడి రాణి’ని పరిచయం చేస్తున్నాము. అవును, మామిడి పండ్ల‌ను రాజుగా పిలుస్తార‌ని తెలుసు. కానీ అందులో ఇది మాత్రం రాణిగా ప‌రిగ‌ణిస్తారు. దీనిని సింధ్ ప్రాంతంలో (ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉంది) పండిస్తారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

ఎలా గుర్తించాలి: ఇది తియ్యగా, అరచేతి పరిమాణంలో, మధ్యస్థ పసుపు రంగులో ఉంటుంది.

అందుబాటులో : మే నుంచి ఆగస్టు వరకు

9. అల్ఫోన్సో

మామిడి పండ్ల రాజు’ ని చేర్చకుండా మన జాబితా ఎలా పూర్తి అవుతుంది. అందరూ దీన్ని ఇష్టపడతారు. దీని రుచి టాప్ లెవ‌ల్ అంటే అతిశయోక్తి కాదేమో!

ఎలా గుర్తించాలి: ఇది తీపిగా, గుండ్రంగా, బంగారు పసుపు రంగులో ఉంటుంది.

అందుబాటులో : మే నుంచి జూన్ వరకు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress