తొంద‌ర‌గా.. రుచిక‌రంగా చికెన్ వేపుడును చేసుకోండిలా!

కావాల్సిన ప‌దార్థాలు :

చికెన్ : 500 గ్రా.

ఉల్లిగ‌డ్డ : 1

పెరుగు : ఒక క‌ప్పు

ధ‌నియాలు : ఒక టీస్పూన్

మిరియాలు : పావు టీస్పూన్

ల‌వంగాలు : 4

దాల్చిన‌చెక్క : ఒక ఇంచు ముక్క‌

యాల‌కులు : 3

నిమ్మ‌కాయ : 1

కొత్తిమీర : ఒక క‌ట్ట

ప‌సుపు : పావు టీస్పూన్‌

క‌రివేపాకు : ఒక రెమ్మ‌

కారం : ఒక టేబుల్ స్పూన్

నూనె, ఉప్పు : త‌గినంత

త‌యారీ :

స్టెప్ 1ః చికెన్‌ని క‌డిగి ఉప్పు, అర‌చెక్క నిమ్మ‌కాయ ర‌సం పిండి మారినేట్ చేయాలి. గంట‌పాటు ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టెప్ 2ః ఒక క‌డాయిలో ల‌వంగాలు, దాల్చిన‌చెక్క‌, మిరియాలు, ధ‌నియాలు, యాల‌కులు వేసి వేయించాలి. వీటిని చ‌ల్లారాక మిక్సీ ప‌ట్టి పొడి చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 3 : ఇప్పుడు క‌డాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయిచాలి. ఇందులోనే ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేగ‌నివ్వాలి.

స్టెప్ 4ః దీంట్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి క‌లుపాలి. ఆ త‌ర్వాత చికెన్ వేసి క‌లిపి మూత పెట్టేయాలి.

స్టెప్ 5ః ముక్క తెల్ల‌గా అయ్యేవ‌ర‌కు అలాగే ఉంచాలి. ఇప్పుడు పెరుగు వేసి ప‌దినిమిషాల పాటు ముక్క ఉడ‌క‌నివ్వాలి.

స్టెప్ 6ః చికెన్ 70శాతం ఉడికింద‌నుకున్న త‌ర్వాత కారం, ఉప్పు, ముందుగా చేసుకున్న మ‌సాలా వేసి ముక్క చిదిమిపోకుండా క‌లిపి మూత పెట్టాలి.

స్టెప్ 7ః చివ‌ర‌గా కొత్తిమీర వేసి దించేస్తే అదిరిపోయే చికెన్ ఫ్రై మీ ముందుంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress