మీకు మధుమేహం లేదా అధిక బ్లడ్ షుగర్ ఉందా? అయితే ఏది తినకూడదు, ఏది తినాలనే ఆందోళన చెందుతున్నారా? అయితే మీరు ఈ ఐదు నట్స్ తిని చూడండి. మార్పు మీరే గమనించండి.
టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రించడంలో డైట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎన్నో పోషక ప్రయోజనాలు ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలి. నట్స్ లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఫైటూ న్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ నట్స్ ని తినప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల భోజనం తక్కువగా తీసుకుంటారు. అప్పుడు చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
బాదం :
ప్రీ డయాబెటిస్ లో ఉన్నవారు గ్లూకోజ్ నియంత్రణ విషయంలో ఈ నట్స్ ను తీసుకోవడం చాలామంచిది. బాదం పప్పులో ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ బీ12తో పాటు అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఉదయం నానబెట్టి వీటిని తీసుకుంటే మంచిది.
పిస్తా :
ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. పిస్తా పప్పులను తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో గ్లైసెమిక్ స్థితి మెరుగుపడుతుంది. పిస్తాపప్పులు తినడం వల్ల గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. అంతేకాదు.. తక్కువ సాంద్రత కలిగి లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
వాల్ నట్ :
ఇది ఒమేగా 3 స్టోర్ హౌస్. వాల్ నట్ నూనెను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. వాల్ నట్ లో ప్రోటీన్, పాలీ అన్ శఆచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇందులో అంసతృప్త కొవ్వు ఆమ్లాలు గ్లూకోజ్ నియంత్రణలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆకలిని అణిచివేస్తాయి.
జీడిపప్పు :
ఇందులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. జీడిపప్పులో కొవ్వు పదార్థం సాపేక్షంగా ఉన్నప్పటికీ ఇందులో ఎక్కువ భాగం మంచి కొవ్వు ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు ఆరోగ్యకరమైనది. సంతృప్త, మోనోశాచురేటెడ్, బహుళ అంసతృప్త కొవ్వు కలిగి ఉంటుంది. రెగ్యులర్ గా తినడం వల్ల ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
పల్లీలు :
ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటుంది. అదే సమయంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువలన పల్లీలు చక్కెర స్థాయిలను తగ్గించగలవు.
నట్స్ ఆరోగ్యానికి మంచివి అయితే.. ఇతర ఆరోగ్య పరిస్థితులను కూడా గుర్తుంచుకోవాలి. గుండె సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, రక్తపోటు మొదలైన సమస్యలు ఉంటే డాక్టరును సంప్రదించి తీసుకోవాలి. తినమన్నారు కదా అని.. నట్స్ ఎక్కువగా కూడా తినకూడదు. మితంగా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.