300 క్యాల‌రీల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మూంగ్‌దాల్ చీలా రెసిపీ టేస్ట్ అదిరిపోతుంది!

కావాల్సిన ప‌దార్థాలు :
పెస‌ర‌ప‌ప్పు : ఒక క‌ప్పు
మెంతులు : పావు టీస్పూన్‌
ప‌చ్చిమిర్చి : 1
అల్లం : చిన్న ముక్క
ప‌సుపు : రెండు టీస్పూన్స్‌
కారం : రెండు టీస్పూన్స్‌
ఇంగువ : చిటికెడు
ఆలుగ‌డ్డ‌లు : 4 (ఉడికించిన‌వి)
ఆవాలు : ఒక టీస్పూన్‌
క‌రివేపాకు : ఒక రెమ్మ‌
ఉల్లిపాయ ముక్క‌లు : ఒక క‌ప్పు
చాట్ మ‌సాలా : ఒక టీస్పూన్
జీల‌క‌ర్ర పొడి : ఒక టీస్పూన్
కొత్తిమీర : చిన్న క‌ట్ట
ఉప్పు, నూనె : త‌గినంత‌

త‌యారీ విధానం :
స్టెప్ 1:
పెస‌ర‌ప‌ప్పును క‌డిగి కొన్ని మెంతులు వేసి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఆ త‌ర్వాత నీళ్లు తీసేసి ప‌చ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేసి కొన్ని నీళ్లు పోసి మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.
స్టెప్ 2 : దోశ పిండిలా రుబ్బుకొని ఉప్పు, జీల‌క‌ర్ర వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి క‌లిపి ప‌క్క‌న పెట్టాలి.
స్టెప్ 3 : ఈలోపు ఒక గిన్నెలో నూనె పోసి ఆవాలు, క‌రివేపాకు, అల్లం తురుము, ఇంగువ‌ వేసి వేగ‌నివ్వాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్క‌ల‌ను రెండు నిమిషాలు వేయించాలి.
స్టెప్ 4 : ఇందులో ఉడికించిన ఆలుగ‌డ్డ‌ల‌ను మెత్త‌గా చేసి వేయాలి. దీంట‌ల్లో ఉప్పు, కారం, ప‌సుపు, కొత్తిమీర‌, చాట్‌మ‌సాలా వేసి దించేయాలి.
స్టెప్ 5 : ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకొని గ‌రిటె నిండా ముందు క‌లిపి పెట్టుకున్న పిండిని దోశ‌లా వేసుకోవాలి. ఆ పైన కొద్దిగా నూనె వేసి ఒక వైపు కాల్చుకోవాలి.
స్టెప్ 6 : రెండ‌వ వైపు కాలిన త‌ర్వాత.. ముందు చేసి పెట్టుకున్న ఆలుగ‌డ్డ కూర‌ను వేసి మ‌ధ్య‌లోకి మ‌లిచి స‌ర్వ్ చేసుకోవాలి. దీన్ని కావాల‌నుకుంటే గ్రీన్ చ‌ట్నీతో తినేయొచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress