పండంటి నిద్రకు.. పన్నెండు సూత్రాలు!!

నాకు నిద్రపట్టడం లేదు. మధ్యలో లేస్తే నిద్రపోవడం కష్టంగా ఉంది. చాలామంది నోటి నుంచి ఈ మాటలు వింటాం. మీరు కూడా ఇలా నిద్రకు సంబంధించి సమస్యలను ఎదుర్కుంటున్నారా? అయితే ఈ నియమాలు పాటించండి.


నిద్ర సరిగా పట్టడం లేదంటే మానసిక, శారీర సమస్యలు ఉండి ఉంటాయి. అలా కాదు మామూలుగా నిద్ర పట్టడం లేదంటే మాత్రం ఈ చిట్కాలు పాటించండి. అప్పటికీ నిద్ర పట్టకపోతే మాత్రం తప్పక వైద్యుడిని సంప్రదించాల్సిందే!

  1. నిద్రకోసం ఒక క్రమపద్ధతి అవలంబించాలి. మామూలు రోజుల్లోనే కాదు.. శని, ఆదివారాల్లో కూడా అదే సమయంలో మార్పు ఉండకూడదు. అప్పుడే నిద్ర క్రమం తప్పదు.
  2. నిద్ర వచ్చే సమయంలో మంచం మీదకు వెళ్లొద్దు. రాని నిద్ర కోసం మంచం మీద దొర్లడం చేయకూడదు.
  3. ఇరవై నిమిషాల తర్వాత కూడా నిద్ర రాకపోతే మంచం మీది నుంచి లేచి సోఫా లేదా కుర్చీలో తక్కువ కాంతిలో కూర్చొని ఏదైనా పుస్తకం చదువండి. ఆ సమయంలో ఫోన్ చూడడం, టీవీ చూడడం లాంటివి చేయొద్దు. ఇలా చేస్తే ఉన్ననిద్ర కూడా పోతుంది.
  4. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, సిగరెట్లు కనీసం నిద్రకి ఆరుగంటల ముందు వరకు తీసుకోవడం ఆపేయాలి. అంటే దాదాపు సాయంత్రం 4 గంటల తర్వాత వీటిని తీసుకోకూడదు. అలాగే మద్యం కూడా నిద్ర స్వభావాన్ని దెబ్బతీస్తుంది.
  5. మంచం నిద్ర, మైథునం కోసమే. తద్వారా మంచానికి మనసుకి బంధం ఏర్పడుతుంది. మంచం పైన చదవడం, తినడం, ఫోను మాట్లాడడం, ల్యాప్ టాప్ తో పని చేయడం, సినిమా చూడడం ఇవన్నీ ఆ బంధాన్ని దెబ్బతీస్తాయి.
  6. పగటిపూట పాడుకోవద్దు. అది మీరు సాయంత్రానికి అలసిపోయేలా చేయదు. తద్వారా నిద్ర వాయిదాపడుతుంది. ఒకవేళ తప్పదు అనుకుంటే ఆ నిద్ర ఒక గంట లోపు ఉండేలా.. అది కూడా మధ్యాహ్నం మూడుకి ముందే నిద్రపోయి లేవాల్సి ఉంటుంది.
  7. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం, గోరువెచ్చని పాలు, చిన్నపాటి వ్యాయామాలు చేయొచ్చు. శ్రావ్యమైన సంగీతం, ఏదైనా పుస్తకం ఒక పద్దతిగా పెట్టుకొని ఆ పనులు చేయాల్సి ఉంటుంది.
  8. నిద్ర మధ్యలో సమయం చూడొద్దు. గడియారాలు, ఫోన్లు పక్కన పెట్టకుండా గది బయట ఉండేలా చూసుకోండి. ఇంతసేపు, అంతసేపు నిద్రపోవాలా? అంటూ మనసులో ఆందోళన చెందవద్దు.
  9. ప్రతిరోజూ లేచిన వెంటనే.. నిద్రపోయిన సమయం, లేచిన సమయం, నిద్రపోవడానికి ముందు ఏం చేస్తున్నారు వంటివి ఒక రెండు వారాలు రాసి పెట్టుకోండి. దీనివల్ల నిద్రక్రమం తెలుస్తుంది.
  10. సరైన ఆహారం తీసుకోవాలి. అది కూడా మితంగా. రాత్రిపూట అస్సలు కడుపు నిండా తినడం మానేయండి. ఒకవేళ తినాలనుకుంటే అది కూడా రాత్రి ఏడుగంటల వరకు మీ డిన్నర్ పూర్తి చేయాలి.
  11. అలాగే ఒకే దగ్గర నిద్రపోవడానికి ప్రయత్నించండి. మొత్తం చీకటిగా ఉండేలా చూసుకోండి. ఏసీ ఉష్ణోగ్రత ఒకే మాదిరిగా ఉండాలి. కొన్నిసార్లు కళ్ల గంతలు మంచి నిద్రకు సహాయపడుతాయి.
  12. ఒకవేళ రాత్రి నిద్ర సరిగా పట్టలేదంటే మీరు ఒత్తిడిలో ఉన్నట్లు! లేదా దైనందిన కార్యక్రమాలు సరిగా పాటించలేనట్లు. అలాగే ఉదయం చేసే వ్యాయామం నిద్రకి ఉత్తమం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress