డబ్బులు చూసి ఖర్చు చేయాలనుకునేవారు ఒక రకం. కొందరు ఆ డబ్బులను నీళ్లలా ఖర్చు చేసినా దానికంటూ ఒక లెక్కాపత్రం ఉంటుంది. కానీ మరికొందరుంటారు.. కొన్ని వింత వస్తువులను దక్కించుకోవడానికి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఆ వస్తువులు, వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిందే!
లగ్జరీ కార్లు, డిజైనర్ బట్టలు, ఖరీదైన గడియారాలు.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కలెక్షన్ చేస్తూ ఉంటారు. వాటికోసం లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. వాటికంటూ ఒక ఉపయోగం, ప్రయోజనం ఉంటాయి. కానీ కొన్నిటికి ఎటువంటి ప్రయోజనం లేకపోగా, మనకి ఆశ్చర్యాన్ని మిగులుస్తాయి. అలాంటి వస్తువులను సొంతం చేసుకోవాలనే సూపర్ ఫ్యాన్స్ ఉంటారు. కొన్ని వింత వస్తువులను వేలం వేస్తే వేలం వెర్రిగా వాటిని కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. అలాంటి విచిత్ర వస్తువుల సమహారమే ఇది.

విన్సన్ చర్చిల్ కట్టుడు పళ్లు..
ప్రముఖ బ్రిటిష్ ప్రధానమంత్రికి ఫాల్స్ దంతాలు ఉండేవి. అంటే కట్టుడు పళ్లన్నమాట. అతను కోపంగా ఉన్నప్పుడు వాటిని విసిరేయడం లేదా విరగొట్టడం చేసేవాడ్లు. అంటే అతని దగ్గర చాలా సెట్లు ఉండేవి. ఈ బంగారంతో అమర్చిన ఫాల్స్ టీత్ సెట్లలో ఒకటి చెల్టెన్‌హామ్‌లో 22400 డాలర్లు అంటే మన ధరలో 19 లక్షల రూపాయలకు వేలం వేయబడింది. అయితే దీనిని సొంతం చేసుకున్న వివరాలు మాత్రం నమోదు కాలేదు.
జాన్ లెన్నాన్ టాయిలెట్

నిజమైన బీటిల్స్ అభిమాని తన ఇష్టాన్నినిరూపించుకోవడానికి ఈ టాయిలెట్ ని సొంతం చేసుకున్నట్లున్నాడు. 2010లో జాన్ లెన్నాన్ వ్యక్తిగత పింగాణీ టాయిలెట్ సీట్ కోసం ఎవరో 11,800 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹10 లక్షల రూపాయలలు ఖర్చు చేశారు. జాన్ లెన్నాన్ తన వ్యాపార ఆలోచనలన్నీ ఈ టాయిలెట్ సీట్ మీద కూర్చొని ఆలోచించేవాడని అంటుంటారు. ఇందులో ఎంత నిజముందో?!
అతిపెద్ద పిల్లుల పెయింటింగ్
మీరు పిల్లులను ఎంతగా ప్రేమిస్తారు? పిల్లుల పెయింటింగ్ కోసం దాదాపు మిలియన్ డాలర్లు 826,000 డాలర్లు ఖర్చు చేశారు.అంటే సుమారు 7.23 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. అతిథుల ఆహ్వానానికి ఈ కుడ్యచిత్రం మంచి ఆప్షన్ అనుకున్నట్లున్నాడు దీన్ని సొంతం చేసుకున్న బిలియనీర్. మరి ఈ చిత్రాన్ని పెట్టడానికి ఒక పెద్ద గోడ మాత్రం అవసరమే కదా.. మీరేమంటారు?!

ఎల్విస్ ప్రెస్లీ జుట్టు

రాక్ ‘ఎన్’ రోల్ రాజు సంగీతం, శైలి, జుట్టును కూడా వారసత్వంగా వదిలి వెళ్లాడా? అయితే జుట్టును మాత్రం ఆయన కాదు… ఆయన బార్బర్ ప్రేమగా కాపాడాడు. ఇప్పుడు ఆ జుట్టును వేలం వేస్తే ఐదు వేల డాలర్లు అంటే సుమారు నాలుగు లక్షల పై చిలుకే వేలానికి తీసుకున్నారు. అయితే ఇది ఇతర వస్తువులతో పోలిస్తే దొంగతనంగా దాచుకున్న వస్తువు కింద జమ కట్టొచ్చు.
క్వీన్ విక్టోరియా లోదుస్తులు..

క్వీన్ విక్టోరియా లోదుస్తుల కోసం 12వేల పౌండ్లు అంటే మన రూపాయల్లో 13 లక్షలు అన్నమాట. విక్టోరియా రెజీనా కోసం వీఆర్ అనే అక్షరాలను ఎంబ్రాయిడరీ చేయించారు. ఈ లో దుస్తులను 2015లో వేలంలో ఈ దుస్తులు అమ్ముడయ్యాయి. 19వ శతాబ్దపు ఈ దుస్తులు ఇప్పటికీ అలాగే ఉండడం గమనార్హం.
మార్లిన్ మన్రో ఎక్స్-రే..

మార్లిన్ మన్రో చరిత్రలో అత్యంత ఆకర్షణీయమైన మహిళల్లో ఒకరు. ఆమె దుస్తువులను, వస్తువులను దాచుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ ఆమె ఎక్స్ రేని కూడా దాచి దాన్ని వేలం వేశారంటే కొంత వింతగా అనిపించడం లేదు. దానిని 45వేల డాలర్లకు అంటే.. సుమారు35 లక్షల రూపాయలకు కొన్నారట. మార్లిన్ మన్రో ఎక్స్ రేతో మరి ఆ కొనుగోలు చేసిన వ్యక్తి ఏం చేశాడో? ఫ్రేమ్ కట్టి భద్రంగా దాచుకొని ఉండొచ్చు.
వైరస్ ల్యాప్‌టాప్..

ఇంటర్నెట్ ఎంత ప్రమాదకరమో డిజిటల్ కళాకారుడు గువో ఓ డాంగ్ చెప్పాలనుకున్నాడు. అందుకే అతను ఉద్దేశపూర్వకంగా ప్రపంచంలోని ఆరు ప్రాణాంతక కంప్యూటర్ వైరస్‌లతో ల్యాప్‌టాప్‌ను లోడ్ చేశాడు. అతను దానిని ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్ అని పిలిచాడు. ఎవరో దాని కోసం 1.3 మిలియన్ల డాలర్లను అంటే.. 11 కోట్ల రూపాయాలు చెల్లించారు. ప్రపంచ సైబర్ డూమ్ ప్రమాదం లేకుండా మీరు అక్షరాలా ఆన్ చేయలేని ల్యాప్‌టాప్ కోసం ఒక మిలియన్ డాలర్లు వెచ్చించారంటే ఏమనాలి?

హిట్లర్ చిత్రాలు
కొన్ని వింత కారణాల వల్ల అడాల్ఫ్ హిట్లర్ కళాకృతులు ఇప్పటికీ వేలం వేయబడుతున్నాయి. 2015 లో ఎవరో అతని వాటర్ కలర్ పెయింటింగ్స్ సేకరణపై దాదాపు అర మిలియన్ డాలర్లు వెచ్చించారు. దాదాపు 3.9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చారిత్రాత్మక కళాఖండాలుగా భావించి వాటిని కొనుగోలు చేసినట్టు సమాచారం.
బ్యాంక్సీ పెయింటింగ్..

2018లో బ్యాంక్సీ ప్రసిద్ధి చెందిన గర్ల్ విత్ ఎ బెలూన్ 1.4 మిలియన్ల డాలర్లు పలికింది. అయితే ఫ్రేమ్ లోపల ఉన్న ఒక పరికరం ద్వారా ఆ పెయింటింగ్ ముక్కలయింది. అయితే ఈ ముక్కను మళ్లీ వేలం వేశారు. ఆశ్చర్యంగా ఆ పెయింటింగ్ 24.5 మిలియన్ డాలర్లు అంటే.. 214 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. కొన్నిసార్లు వింతైన వేలం వస్తువులు మరింత వింతగా జరుగుతాయి అనడానికి ఇది రుజువు.